UPDATES  

NEWS

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి తైవాన్ మామిడి మొక్క నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ పండుగలను ప్రకృతితో మమేకం చేయాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. వేలాది మొక్కలు నాటి పచ్చదనం కోసం కృషి చేస్తున్న విశ్వామిత్ర చౌహాన్‌ను అభినందించారు.విశ్వామిత్ర చౌహాన్ నాటిన ఈ మొక్క 1541వ మొక్క కావడం విశేషం. […]

ఖానంపల్లి ఎఫ్ఎన్ టి, భూ సేకరణకు 5.40 కోట్ల నిధులు విడుదల

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూ సేకరణ పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. పెద్దపల్లి సమీకృత […]

ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి

ధర్మారం (తెలంగాణ వాణి) మంగళవారం సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అనగారిన వర్గాల, శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారినిఎదిరించి పోరాడి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన మహనీయుడని కొనియాడారు. చైతన్యానికి స్ఫూర్తి నిచ్చిన పోరాట యోధుని గాధలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం […]

రామయ్యపల్లిలో పంట కుంట పనులు ప్రారంభించిన సర్పంచ్

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో వివి రాంజీ పథకం ద్వారా పంట కుంట పనులను సోమవారం స్థానిక సర్పంచ్ మూల మంగ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ పంట పొలాల్లో వర్షపు నీటిని నిలువ చేసుకోవడానికి, భూగర్భ జలాలను పెంచడానికి, వేసవిలో సాగునీటి కొరతను అధిగమించడానికి పంట కుంటలు నిర్మించుకోవడం ఎంతో ప్రయోజనకరమని సర్పంచ్ మంగ తెలిపారు. వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని […]

జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి

జర్నలిస్టుల హక్కుల సాధనకు టీయూడబ్ల్యూజే నిరంతర కృషి నివేషణ స్థలాల కోసం త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి  అర్హులైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలి జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా చందుర్తి,ఆగస్టు 16 (తెలంగాణ వాణి ప్రతినిధి) : జర్నలిస్టుల హక్కుల సాధనతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయించే వరకు ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాజన్న […]

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐక్యవేదిక నుండి ముఖ్య అతిథిగా పాల్గొన్న డా” సతీష్ యాదవ్ వనపర్తి : ఆగష్టు 15, (తెలంగాణ వాణి ప్రతినిధి) శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ హైదరాబాద్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు జరిపిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్ త్వరలో విస్తరించబోయే సంస్థను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ప్రవేశించాలని అందుకు అనుగుణంగా శినివారం జరుగుతున్న స్వాతంత్ర […]

పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి, ఆగస్టు 15 (తెలంగాణ వాణి ప్రతినిధి) మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్ పట్లోళ్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ కౌడిపల్లి గోపాల్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు. పదో తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన మన్నేశారికకు రూ.3,000, ద్వితీయ స్థానంలో నిలిచిన షాలోమి ముత్యాలకు రూ.2,000, తృతీయ స్థానంలో నిలిచిన […]

విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అనుమండ్ల షిలా తన యొక్క బంధువులు ఉన్నత స్థానాల్లో స్థిరపడగా పూర్వ విద్యార్థుల ద్వారా 1,20,000 వేల రూపాయలు సేకరించి విద్యార్థుల కొరకు స్పోర్ట్స్ యూనిఫార్మ్స్ కొనుగోలు చేశారు. అనంతరం అట్టి యూనిఫామ్స్ ను శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 260 మంది విద్యార్థిని, విద్యార్థులకు స్థానిక ఎంఈఓ పోతూ ప్రభాకర్ చేత […]

హర్ ఘర్ తిరంగ యాత్రను విజయవంతం చేయండి

ధర్మారం (తెలంగాణ వాణి )పంద్రా ఆగస్టు రోజున ధర్మారం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించాలని మండల ముఖ్య కార్యకర్తల సమావేషంలో బిజెపి మండల ఇంచార్జి కొమ్ము రాంబాబు కార్య కర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని వైశ్య భవన్ లో మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల […]

వెంకటాపురం గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

సెప్టెంబర్ 9న వరంగల్ ఎమ్మార్పీఎస్ మహాసభను జయప్రదం చేయండి  నూతన అధ్యక్షులు ఎలమకంటి శ్రీనువాస్    సంగెం (తెలంగాణ వాణి) వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం వెంకటాపురం గ్రామంలో పసునూటి ఎల్లయ్య అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ కమిటీ సమావేశం జరిగింది, ఈ సమావేశానికి సంగెం మండల ఇంచార్జి కోడూరి రాజు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9వ తేదీన వరంగల్ లో జరగనున్న […]