UPDATES  

NEWS

 ముగిసిన మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు

ధర్మారం (తెలంగాణ వాణి ) ధర్మారం మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు గురువారం నంది మేడారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ధర్మారం మండల విద్యా వనరుల అధికారి (ఎంఈఓ ) పాఠశాల క్రీడల చైర్మన్ పి ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి కె. లక్ష్మణ్, నంది మేడారం సర్పంచ్ వీరపాల్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ, వార్డు సభ్యులు శ్రీనివాస్, ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో మండల స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పెద్దపల్లి జోనల్ స్థాయి పాఠశాల క్రీడా పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మారం ఎస్ జిఎఫ్ పాఠశాల క్రీడల కార్యదర్శి తుమ్మల సౌజన్య, వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్ శ్రీనివాస్, గౌతం, టి. కుమార్, బి. కొమురయ్య, స్రవంతి, భాగ్యలక్ష్మి, నర్మద, పుష్పలత, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 3 September 2026, 4:45 pm Posted by : TELANGANA VANI

ముగిసిన మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు

ధర్మారం (తెలంగాణ వాణి ) ధర్మారం మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీలు గురువారం నంది మేడారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ధర్మారం మండల విద్యా వనరుల అధికారి (ఎంఈఓ ) పాఠశాల క్రీడల చైర్మన్ పి ప్రభాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి కె. లక్ష్మణ్, నంది మేడారం సర్పంచ్ వీరపాల్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ, వార్డు సభ్యులు శ్రీనివాస్, ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో మండల స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పెద్దపల్లి జోనల్ స్థాయి పాఠశాల క్రీడా పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మారం ఎస్ జిఎఫ్ పాఠశాల క్రీడల కార్యదర్శి తుమ్మల సౌజన్య, వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్ శ్రీనివాస్, గౌతం, టి. కుమార్, బి. కొమురయ్య, స్రవంతి, భాగ్యలక్ష్మి, నర్మద, పుష్పలత, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest