UPDATES  

 ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐక్యవేదిక నుండి ముఖ్య అతిథిగా పాల్గొన్న డా” సతీష్ యాదవ్

వనపర్తి : ఆగష్టు 15, (తెలంగాణ వాణి ప్రతినిధి) శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ హైదరాబాద్ లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులు జరిపిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్ త్వరలో విస్తరించబోయే సంస్థను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో ప్రవేశించాలని అందుకు అనుగుణంగా శినివారం జరుగుతున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగిందని సతీష్ యాదవ్ తెలిపారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నాగభూషణంను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నర్సిరెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్, బుద్ధారం మహేందర్, జగత్ పల్లి రమేష్, కరుణాకర్, పెద్దగూడెం ఆంజనేయులు, జలంధర్, విశ్వనాథ్, యాదయ్య, రాజ్ కుమార్, మహబూబ్నగర్ రిటైర్డ్ రిజిస్టార్ మల్లారెడ్డి, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest