తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలి
కొత్తగూడెం (తెలంగాణ వాణి) తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యధావిధంగా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి తెలుగు భాషాభిమానుల అభిమానం చూరగొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తెలుగు […]
రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధించిన కొత్తగూడెం క్రీడాకారులు
కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఈ నెల 19 నుండి 20 వరకు 2 రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్న కొత్తగూడెం క్రీడాకారులు 4 బంగారు పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు పతకాలతో సత్కరించి అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా మన జిల్లాకు మంచి పేరు తేవాలని అభినందనలు తెలిపారు. కొత్తగూడెం కు చెందిన ఏ వందన డిస్కస్ త్రో, హెపటాదిలిన్ లో రెండు బంగారు పథకాలు, […]
టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా
గుంటూరు (తెలంగాణ వాణి కరస్పాండెంట్) స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి లపై ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సొసైటీ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు గాయత్రి బెహరా మాట్లాడుతూ తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు ఉందని, తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన తిరుపతి లడ్డు […]
యూట్యూబ్ వీడియోస్ పేరిట ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన మరో సంస్థ
కోట్లు నొక్కేసి కుంటి సాకులు చెబుతున్నారంటు బాధితుల ఆవేదన ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులు, యువతే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి […]
ఢిల్లీకి గులాంగిరి చేయడం కోసమే రాజీవ్ విగ్రహ ఏర్పాటు : కొట్టి వెంకటేశ్వరరావు
తెలంగాణ రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహాం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటం తెలంగాణ తల్లిని అవమానించడమేనని బిఆర్ఎస్ పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కకాంతారావు సూచనలతో రేవంత్ ప్రభుత్వం తీరుకు నిరసనగా పార్టీ లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి […]
ఢిల్లీ సీఎంగా అతిషి
తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) రాజధాని ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న సందేహం కలిగింది. ఈ క్రమంలో అతిషీ, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. చివరకు మంత్రి అతిషీకి ముఖ్యమంత్రి […]
మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది “ఎర్రజెండా” నే
నిజాంకు వణుకు పుట్టించిన చర్రిత తెలంగాణ ప్రజలది సాయుధ పోరాట చరిత్ర దేశానికి దిక్చూచి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా సాయుధపోరాట దినోత్సవం కొత్తగూడెం (తెలంగాణ వాణి) మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది కమ్యూనిస్టుల ఎర్రజెండానేనని, కమ్యూనిస్టులతో మమేకమై నాటి మట్టిమనుషులు సాగించిన విరోచిన పోరాట ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. 76వ తెలంగాణ సాయుధ రైతాంగ […]
కొత్త ఒరవడికి సీఎం నాంది ! నిమజ్జన వేడుకల్లో రేవంత్
హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. మంగళవారం ఉదయమే మహాగణపతి శోభయాత్ర మొదలైంది. ఆ బొజ్జ గణపయ్య అడుగడుగునా భక్తుల పూజలందుకుంటూ ముందుకుసాగుతున్నాడు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో బడా గణేష్ శోభాయాత్ర సాగుతోంది. బడా గణేష్ ముందు చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ గణపయ్యను నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జనం కోసం బడా గణేష్ ఒడిఒడిగా హుస్సేన్ సాగర్‌వైపు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ మహాగణపతి తెలుగు […]
జాతీయ జెండాకు అవమానం
తల్లకిందులుగా ఆవిష్కరించిన ఉపాధ్యాయులు జూలూరుపాడు (తెలంగాణ వాణి) జూలూరుపాడు మండలంలోని రామచంద్రాపురం ఎంపిపిఎస్ పాఠశాలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థుల సమక్షంలో జాతీయ జెండాను తల్లకిందులుగా ఆవిష్కరించారు. ఈ విషయాన్నీ ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ జెండాను సరిచేసే ప్రయత్నం చేయకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వారే జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటని వెంటనే జాతీయజెండా […]
హరీష్ రావు బృందాన్ని విడుదల చేసిన కేశంపేట పోలీసులు
హైదరాబాద్ (తెలంగాణ వాణి బ్యూరో) గత మూడు గంటలుగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరుల అరెస్టు సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. మంత్రి హరీష్ రావు తదితర బృందాన్ని కెశంపేట పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత వదిలేశారు. దీంతో హరీష్ రావు తదితరులు తమ వాహనాల్లో వెళ్లిపోయారు. ఈ […]