ముంబై దెబ్బకు బీజింగ్ బేజారు.. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు
భారత ఆర్థిక రాజధాని ముంబై వరల్డ్ లెవల్‌లో సత్తా చాటింది. పొరుగు దేశం చైనా క్యాపిటల్ బీజింగ్‌ను వెనక్కు నెట్టింది. ఆర్థికంగా తనకు ఎవరూ సాటి రాలేరని మరోసారి చాటి చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇండియాను ఆకాశానికెత్తేస్తున్నారు. బీజింగ్‌ను వెనక్కునెట్టి ఆసియా బిలియనీర్ క్యాపిటల్ టైటిల్‌ను ముంబై కైవసం చేసుకుంది. ఈ మేరకు తాజాగా విడుదలైన ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024’ దీన్ని ధ్రువీకరిస్తోంది. 92 మంది బిలియనీర్లతో ముంబై చరిత్రలో మొట్టమొదటిసారిగా […]
ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో ఇండియాలో అతిపెద్ద సంస్థగా హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీకి మంచి మార్కెట్ ఉంది. కంపెనీ గడచిన కొన్నాళ్లుగా తమ వ్యాపారాలను రీస్రక్చరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీ తాజాగా తన ప్యూరిట్ వాటర్ ప్యూరిఫైయర్ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తోంది. మీడియా నివేదికల ప్రకారం దీని కోసం కంపెనీ కొంతమంది కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుపుతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. […]
New Toll System: టోల్ ట్యాక్స్ కలెక్షన్‌కు కొత్త సిస్టమ్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన
దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధితో పాటు కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. ఇందుకు అయిన ఖర్చులను తిరిగి రాబట్టేందుకు ఆయా వాహనాల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తుంటారు. ఈ లావాదేవీల కోసం గతంలో నగదు వినియోగించేవారు. మారుతున్న కాలంతో పాటు తర్వాత వివిధ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్ కలెక్షన్ జరుగుతోంది. అయితే ఈ విషయంలో త్వరలోనే మార్పులు జరగనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి […]
UPI పేమెంట్స్ సక్సెస్ వెనుక సూపర్ ఉమెన్.. ఇండియా చెల్లింపుల వ్యవస్థలో కీ రోల్
పేమెంట్ వ్యవస్థలో UPI విధానం ఓ గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. నడిరోడ్డుపై కూడా సెకన్ల వ్యవధిలో భారతీయులు నగదు బదిలీ జరపడాన్ని కనీసం ఎవరూ ఊహించి ఉండరు. కానీ దీన్ని సుసాధ్యం చేయడంలో ఓ మహిళ ప్రముఖ పాత్ర పోషించారని చాలా మందికి తెలియదు. దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ కీలకంగా వ్యవహరించారు. ఆమె వ్యూహాత్మక సూచనల నుంచి […]
RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
రూ. 2,000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం నాడు రూ. 2,000 నోట్లను మార్చుకునే లేదా డిపాజిట్ చేసే సదుపాయం ఏప్రిల్ 1న మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐకి చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం నుంచి నోట్లు తీసుకోవడం ప్రారంభమవుతుంది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 ఇష్యూ కార్యాలయాల్లో ఖాతాల వార్షిక ముగింపుకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా రూ. 2,000 […]
Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
బంగారం ధర పెరుగుతూనే ఉంది. నెల క్రితం వరకు 10 గ్రాములకు రూ.63 వేలు ఉన్న పుత్తడి ప్రస్తుతం రూ.67 వేలకు చేరింది. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధర కాస్త పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6,732 గా ఉంది. అంటే 10 గ్రాముల స్వర్ణం ధర రూ. 67320 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 61,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల […]
ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ తన వాటాదారులు లేదా పెట్టుబడిదారులకు డివిడెండ్ చెల్లింపును ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. తదుపరి సమావేశం జరిగినప్పుడు డివిడెండ్ సిఫార్సు కోసం ప్రతిపాదనను తమ బోర్డు చేపడుతుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా తెలియజేసింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను పరిశీలించి ఆమోదించడానికి తమ బోర్డు ఏప్రిల్ చివరి వారంలో సమావేశమవుతుందని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. BSEలో కంపెనీ ప్రకటన ప్రకారం, ICICI బ్యాంక్ […]
Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
భారత్ 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి రాబోయే మూడు దశాబ్దాల్లో 9-10 శాతం వృద్ధి రేటును సాధించాలని అమితాబ్ కాంత్ అన్నారు. 2027 నాటికి జపాన్ జర్మనీలను అధిగమించి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమితాబ్ కాంత్ అంచనా వేశారు. “2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే కాకుండా తలసరి ఆదాయాన్ని ఇప్పుడున్న 3,000 డాలర్ల నుంచి 18,000 డాలర్లకు పెంచాలన్నదే మా ఆశయం” […]
EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా కోట్లాది ఖాతాదారులను కలిగి ఉంది. మీరు కూడా ఈపీఎఫ్ఓలో ఖాతా ఉన్నట్లయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. EPFO చందాదారులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్ మోసం నుంచి ఖాతాదారులను రక్షించడానికి ఈపీఎఫ్ఓ కేవైసీని తప్పనిసరి చేసింది. దీనితో పాటు కేవైసీ ఈపీఎఫ్ఓకి సంబంధించిన క్లెయిమ్‌లు, సెటిల్‌మెంట్ కేసులను కూడా వేగవంతం చేస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది ఖాతాదారులకు ఇంటి వద్ద కూర్చొని e-KYC […]
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్-ఆధారిత నిర్మాణ, ఇంజనీరింగ్ ప్లేయర్ ఆఫ్కాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)గా రానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ. 7,000 కోట్లను సమీకరించడానికి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి)ని దాఖలు చేసింది. సంస్థ తాజా ఇష్యూ ద్వారా రూ.1,250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.5,750 కోట్లు సమీకరించనుంది. డిఆర్‌హెచ్‌పి ప్రకారం గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఓఎఫ్‌ఎస్‌లో దాదాపు […]