UPDATES  

NEWS

 వెంకటాపురం గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

సెప్టెంబర్ 9న వరంగల్ ఎమ్మార్పీఎస్ మహాసభను జయప్రదం చేయండి 

నూతన అధ్యక్షులు ఎలమకంటి శ్రీనువాస్ 

 

సంగెం (తెలంగాణ వాణి) వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం వెంకటాపురం గ్రామంలో పసునూటి ఎల్లయ్య అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ కమిటీ సమావేశం జరిగింది, ఈ సమావేశానికి సంగెం మండల ఇంచార్జి కోడూరి రాజు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 9వ తేదీన వరంగల్ లో జరగనున్న జాతీయ స్థాయి మండల అధ్యక్షుల మహాసభను విజయవంతం చేయడానికి గ్రామ కమిటీ నిర్మాణాన్ని చేపట్టామని ఆయన తెలిపారు,

ఈ సందర్భంగా వెంకటాపురం గ్రామ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎలమకంటి శ్రీనివాస్ ను, ప్రధాన కార్యదర్శిగా పసునూటి ప్రసంగిని ఎన్నుకున్నారు మండలంలోని అన్ని గ్రామాల బాధ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎమ్మార్పీఎస్ నిర్మాణానికి సహకరించాలని కోరారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఎలమకంటి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో సమసమాజ స్థాపన కోసం మంద కృష్ణ మాదిగ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు, అణగారిన వర్గాల అభ్యున్నతి మరియు సామాజిక పరివర్తన కోసం జరుగుతున్న ఈ నిర్మాణ కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆధాం,యేసు, బాసిపాక ప్రేమ్ కుమార్,సంపత్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest