UPDATES  

NEWS

మేడారం గురుకుల పాఠశాల కళాశాల చైర్మన్ గా సుజాత

ధర్మారం, ఆగస్ట్ 09 (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీని శనివారం సాయంత్రం ఎన్నుకున్నట్లు ఇంచార్జ్ ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. చైర్మన్ గా చుంచు పుష్పలత, వైస్ చైర్మన్ గా లంకదాసరి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఆర్ ప్రేమలత, ట్రెజరర్ గా ఏదుల్ల సంధ్య, జాయింట్ సెక్రటరీగా ఎం పుష్పలత లను ఎన్నుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ విజయ, […]

ఎంపీ వంశీ కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు నిరాధారం

ధర్మారం, ఆగస్ట్ (తెలంగాణ వాణి) పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై బిజెపి నాయకులు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు సరైనవి కాదని మరోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ధర్మారం మండల కేంద్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు నియోజకవర్గం తో పాటు, ధర్మపురి […]

కొత్త పెన్షన్ నిబంధనలతో పేదలకు అన్యాయం

బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్   శంకరపట్నం (తెలంగాణ వాణి) తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెన్షన్ అర్హత నిబంధనలను బిజెపి శంకరపట్నం మండల శాఖ ఖండించింది. గురువారం మండల బిజెపి అధ్యక్షుడు ఏనుగుల అనిల్ పేదలు, వృద్ధులు, వితంతు మహిళలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అంటూనే గతంలోని ప్రభుత్వాల కన్నా పెన్షన్ అర్హతల నిబంధనలు పెంచి వారికి అన్యాయం చేస్తుందని, వృద్ధాప్య పెన్షన్ […]

బస్టాప్‌లు బండ్ల కోసమా.. ప్రయాణికుల కోసమా?

బస్టాప్‌లను ఆక్రమిస్తున్న ద్విచక్ర వాహనాలు ఎండ, వర్షంలో రోడ్డుపైనే నిరీక్షిస్తున్న ప్రయాణికులు ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్టాప్‌లు ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే కొందరు వాహనదారులు తమ బైక్‌లను బస్టాప్‌లలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షం వచ్చినా, ఎండ తీవ్రంగా ఉన్నా బస్టాప్‌లలో కూర్చునే అవకాశం లేకపోవడంతో బస్సుల కోసం ఎదురుచూసే మహిళలు, […]

కరీంనగర్ జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ మెంబర్ గా డాక్టర్ నీలం సంపత్

కరీంనగర్ జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ మెంబర్ గా డాక్టర్ నీలం సంపత్ నియామకం కరీంనగర్,ఆగస్టు 02 (తెలంగాణ వాణి) :గత ఇరవై సంవత్సరాలుగా రాష్టంలోని వివిధ విద్యా సంస్థల్లో,పారిశ్రామిక సంస్థల్లో,విద్యార్థులకు,అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు,ప్రయాణీకులకు,పాదచారులకు,అన్ని రకాల రోడ్డు యూజర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రోడ్డు భద్రత కార్యకర్త,సామాజిక కార్యకర్త,విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలం సంపత్ ను కరీంనగర్ జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన […]

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి..

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం (జులై 31) అర్ధరాత్రి కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో ఆయన మరణించారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. పెద్ది మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈరోజు పెద్ది స్వగ్రామమైన […]

కొండగట్టు ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం

కొండగట్టు ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షం రెండు వాహనాలు ధ్వంసం, ఒకరికి గాయాలు జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు శివారులోని మెహర్ బాబా ఆలయం ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా కూలిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న రెండు వాహనాలపై ఈ చెట్టు పడడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స […]

త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు..మొదట హైదరాబాద్‌ లో..ఆ తర్వాత పెద్ద సిటీల్లో..

త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు..మొదట హైదరాబాద్‌ లో..ఆ తర్వాత పెద్ద సిటీల్లో.. రాష్ట్రంలో త్వరలోనే ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఎలక్ట్రిక్ ఆటోల తయారీ కంపెనీలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆటోలు రోడ్డెక్కనున్నాయి. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆర్టీసీ ఈ ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతోంది. బస్సుల్లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు బస్ టికెట్‌తో […]

నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రులు..

నేడు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రులు.. దాదాపు రూ.15.22 కోట్ల పనులను ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన ఆహ్లాదకరంగా సిద్ధమైన గుడి చెరువు బండ్ పార్క్ సిరిసిల్ల ఖ్యాతిని మరింత ఇనుమడించేలా వస్త్రం తయారీ దశల నమూనాలు ఆకట్టుకుంటున్న మోడల్ బస్ స్టేషన్లు రాజన్న సిరిసిల్ల,జూలై 30 (తెలంగాణ వాణి) : జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, చేనేత జౌళి శాఖ […]

కోనరావుపేట మండలంలో ​మూలవాగు ఉధృతికి తెగిన రహదారి

కోనరావుపేట మండలంలో ​మూలవాగు ఉధృతికి తెగిన రహదారి మామిడిపల్లి-నిజామాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు కోనరావుపేట,జూలై 30 (తెలంగాణ వాణి) :సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో వర్షాల ధాటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలకు మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు నీటి ఉధృతికి మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాల మధ్య ఉన్న రహదారి పూర్తిగా తెగిపోయింది. రహదారి కొట్టుకుపోవడంతో ఆయా గ్రామాల నడుమ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. […]