రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమ నాయకులకు ఘన సన్మానం

జిల్లా ఏర్పాటు పోరాటంలో గొంటి శంకర్ కీలక పాత్ర జేఏసీ కో-కన్వీనర్ సేవలకు గుర్తింపు.. వేములవాడకు గర్వకారణం రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 11 (తెలంగాణ వాణి ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను సిరిసిల్లలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేములవాడకు చెందిన జిల్లా సాధన ఉద్యమ జేఏసీ కో-కన్వీనర్, న్యాయవాది గొంటి శంకర్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. వేములవాడ బార్ అసోసియేషన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న […]
లంచం మత్తులో ఖాకీలు సీఐ, ఎస్సైలపై ఎస్పీ వేటు

– తహసీల్దార్ ఆర్డర్లకే దిక్కులేదు – తిమ్మాపూర్ సీఐ,ఎస్సైల అరాచక వసూళ్లపై సీపీ సంచలన వేటు – జేసీబీ,ట్రాక్టర్ల రిలీజ్ కోసం లక్ష డిమాండ్ వైన్ షాప్‌లో “ఫోన్ పే” వసూళ్లు – అధికారికంగా చలానాలు కట్టినా, తహసీల్దార్ఆర్డరిచ్చినా తగ్గని ఖాకీల బరితెగింపు తిమ్మాపూర్,అక్టోబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి): ఖాకీల అండతో ఎవరిని పడితే వారిని పీడించవచ్చు.. చట్టాలు, నిబంధనలు మా కింది చుట్టే అనుకున్న కొందరు పోలీసు అధికారుల ఆటలు సాగలేదు. బాధితుల కన్నీళ్లను […]
అంబేద్కర్ యువజన సంఘం జిల్లా పగ్గాలు మళ్లీ మహేందర్‌కే

కరీంనగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నియామక పత్రం అందజేత కరీంనగర్ టౌన్,అక్టోబరు 4 (తెలంగాణ వాణి ప్రతినిధి): ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది జేరిపోతుల మహేందర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొంకురి మధుల సమక్షంలో ఆయనకు నియామక పత్రం అందజేశారు. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం […]
అంతర్గాం నూతన ఎస్సైగా టి. ఉదయ్ కిరణ్ బాధ్యతల స్వీకరణ

మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పొట్యాల ఉప సర్పంచ్ బొండ్ల సురేష్ పెద్దపల్లి : అక్టోబర్, 3 (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) అంతర్గాం పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా టి. ఉదయ్ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పొట్యాల గ్రామ ఉప సర్పంచ్ బొండ్ల సురేష్ నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బొండ్ల సురేష్ మాట్లాడుతూ అంతర్గాం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీస్ […]
వేములవాడ రూరల్ పరిధిలో ఆలయాల్లో చోరీలు

వేములవాడ, సెప్టెంబర్ 28 (తెలంగాణ వాణి):వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలోని ఎల్లమ్మ, పెద్దమ్మ దేవాలయాలతో పాటు బాలరాజుపల్లి పెద్దమ్మ దేవాలయంలో సెప్టెంబర్ 27 అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు.ఆలయాల్లోని నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. కేసులు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆలయ నిర్వాహకులు నగదు, విలువైన వస్తువులు ఉంచకుండా […]
పేదలకు అండగా సాయి రూప చారిటబుల్ ట్రస్ట్

వేములవాడ 12 సెప్టెంబర్ (తెలంగాణ వాణి): పేదలకు అండగా నిలుస్తూ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల అజయ్ తండ్రి ఇప్పపూల లక్ష్మీరాజం జ్ఞాపకార్థం శనివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పేదలకు గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల మమత–అజయ్ మాట్లాడుతూ.. సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ పేదలకు భరోసాగా నిలుస్తూ, సమాజ సేవలో […]
అగ్ని ప్రమాద బాధితులకు కొత్త ఇళ్లు

బండపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ వాణి ప్రతినిధి):అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మంజుల, శేఖర్, రజిత కుటుంబాలు ఎట్టకేలకు నూతన ఇళ్లలోకి అడుగుపెట్టారు. నూతనంగా నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ కటకం మల్లేశం, ఉపసర్పంచ్ ఈసాక్‌తో పాటు గ్రామ పెద్దలు హాజరై బాధిత కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలు తిరిగి సొంతింటిలో అడుగుపెట్టడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నూతన ఇళ్లలో […]
జన్మదినం….జనహితానికి అంకితం….!
జన్మదినం…జనహితానికి అంకితం…! రోగులకు చేయూత…ప్రకృతికి తోడుగా… సేవా సందేశం చాటిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా వేములవాడ,జూలై 25 (తెలంగాణ వాణి ప్రతినిధి) : నేటి సమాజంలో జన్మదినం అంటే కేక్ కటింగ్‌లు, పూల బొకేలు, శుభాకాంక్షల సందడి అనే భావన బలపడుతున్న వేళ,ఆ వేడుకకు సామాజిక బాధ్యతను జోడించి ఆదర్శంగా నిలిచారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా.తన జన్మదినాన్ని […]
ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…

ఎనిమిది మంది భక్తులను బలి తీసుకున్న రెడీమిక్స్ ట్యాంకర్. కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం. కర్నూల్ (తెలంగాణ వాణి) మంత్రాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం సమీపంలో భక్తులతో ప్రయాణిస్తున్న బోలేరో గూడ్స్ వాహనం ట్యాంకరు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది […]
తడ్కల్ లో శ్రీ జగద్గురు తుకారాం మహారాజ్ ఘథా పూజ
తుకారం ఘథా పూజ నిర్వహించిన సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, సంగారెడ్డి,కంగ్టి,జనవరి 09,( తెలంగాణ వాణి ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ రుక్మిణి పాండురంగ, ఆలయంలో వైష్ణవ సాంప్రదాయిక అఖండ హరినామ్ సప్తహ ముడవ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం దేహు నివాసి శ్రీ జగద్గురు తుకారం మహారాజ్ పంచమా వేదమైన తుకారం ఘథా పూజా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, నిర్వాహకులు ఎలిశల హనుమంత్ రెడ్డి, కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా […]