ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూ సేకరణ పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. భూ సేకరణ పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. ధర్మారం మండలంలోని ఖానంపల్లి గ్రామంలో కొత్త నూతన చెరువు నిర్మాణం ఎఫ్ఎన్ టి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నిమిత్తం రూపాయలు 5.40 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. త్వరలోనే రైతులకు పరిహారం చెల్లించి భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు.



