జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం

హైదరాబాద్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) వరంగల్ జిల్లా స్థాయి తైక్వాండో సీఎం కప్ లో విజయం సాధించి హైదరాబాదులో ఎస్ జి ఎఫ్ ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని విద్యార్థులు బి అక్షయ, సి అక్షర, ఎ అక్షయ, మామునూరి శ్రమజా సంపత్, కె కిజీయాబీ, ప్రశాంత్, బి రామ్ చరణ్, సి అభ్యాస్, కే ధీరజ్ […]
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కానీ భారీగా మొక్కలను పెంచుతు తన ఇంటిపేరునే వనజీవి గా మార్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈయన చేసిన కృషికి గుర్తింపుగా సామజిక సేవా విభాగంలో 2017 పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కోటికిపైగా మొక్కలు నాటిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
జగిత్యాల కలెక్టరేట్లో అవినీతి కలకలం

లంచం తీసుకుంటూ ఏసీబీ దాడిలో సీనియర్ అసిస్టెంట్ రఘు పట్టివేత జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు జగిత్యాల (తెలంగాణ వాణి) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అకౌంటెంట్ రఘు కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.కోరుట్ల పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పవన్ కుమార్ సిపిఎస్ సంబం ధించిన డబ్బులు తమ అకౌంట్లో జమకావాలని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ […]
పట్టపగలు నడిరోడ్డుపై గోమాత వధ

బహిరంగ ప్రదేశాల్లో వధిస్తున్న చోద్యం చూస్తున్న అధికారులు కోదాడ (తెలంగాణ వాణి) పట్టణ పరిధిలో పట్టపగలు నడి రోడ్డు మీదనే ఆవులను వధిస్తున్నారు. పట్టణంలో ఆవుని కోసిన ఒక సంఘటనలో ఇరుగు పొరుగున నివాసం ఉన్న వ్యక్తులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కమీషనర్ దిగువ అధికారులకు చెప్పి, అంతటితో తన బాధ్యత పూర్తయినట్లు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని తెలిసి ఆవుని “వధించిన వారు” ఫిర్యాదు చేసిన కుటుంబంలోని మహిళల మీద దాడి చేశారని, […]
యధార్థ జీవితాల వాస్తవిక చిత్రణ – కుండి

హైదరాబాద్ (తెలంగాణ వాణి) మానేటి మట్టిల పుట్టిన మంచి ముత్యం.నారాయణ పురం టంకసాలలో రూపుదిద్దుకున్న పదహారణాల పల్లెనాణేం. తాడితపీడిత జనపక్షం వహించిన అలుపెరుగని అభ్యుదయ కలం. దొరతనాన్ని,దోపిడీని ఎదిరించిన ధిక్కార గళం.పరిశోధనా రంగాన్ని పరిపుష్టం గావించిన శాస్త్రీయ దృక్కోణం.భాషా శాస్త్రంలో నిరంతర శ్రమకు,పరిశ్రమకు నిదర్శనంగా నిలిచిన నిలువెత్తు సంతకం.సృజన రంగాన సల్పిన అవిరళకృషికి,పట్టుదలకు పెట్టింది పేరుగా నిలబడ్డ నిలువుటద్దం. భారత దేశ సమైక్యత,సమగ్ర తలను సంరక్షించిన భారతీయ సాహిత్యానికి పట్టుగొమ్మ.తెలుగు, హిందీ,ఆంగ్లం,తమిళం,కన్నడం, మలయాళం,బెంగాలీ,అస్సామీ, ఒరియా,గుజరాతీ,పంజాబీ,ఉర్దూ, సంస్కృతం,మరాఠీ పద్నాలుగు భాషల్లో […]
మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా అల్లం నారాయణ ?

హైదరాబాద్ (తెలంగాణ వాణి) తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అల్లం నారాయణకు కేబినెట్ ర్యాంకులో ఈ హోదాను ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తరపున కీలక పాత్ర పోషించిన ఆయనను సముచితంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే సీఎం […]
గ్రామ సరిహద్దు వివాదం పరిష్కారానికి ఆర్డీవో హామీ

మెట్ పల్లి (తెలంగాణ వాణి) మెట్పల్లి డివిజన్ పరిధిలోని మల్లాపూర్ మండలం మొగిలిపేట, నడకుడా గ్రామాల సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. శనివారం మొగిలిపేట గ్రామస్తులు ధాన్యం విక్రయించేందుకు వివాదాస్పద స్థలాన్ని చదును చేయడంతో విషయం తెలుసుకున్న నడకుడ గ్రామస్తులు రావడంతొ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ, పోలీస్ శాఖ వారు సంఘటన స్థలానికి వచ్చారు. మల్లాపూర్ తాసిల్దార్ వీర్ సింగ్ రెండు గ్రామాల సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తామని అన్నా కాని శాంతించకపోవడంతో […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట

ఢిల్లీ తెలంగాణ వాణి (ప్రత్యేక ప్రతినిధి) ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లో ఐన్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు కి ఊరట… ఏడాది క్రితం శ్రవణ్ రావుపై కేసు పెట్టిన పోలీసులు… అక్రమంగా కేసు పెట్టారంటూ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన శ్రవణ్ రావు… శ్రవణ్ రావును అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు రక్షణ….. నిర్భయంగా విచారణకు హాజరు కావొచ్చని కోరిన సుప్రీంకోర్టు…
నాతో ఫ్రీ గా ఉండు నీకేం కావాలన్న ఫ్రీగా ఇస్తా

యువతి పట్ల జిరాక్స్ షాప్ నిర్వహకుడి వెకిలి చేష్టలు దేహశుద్ధి చేసిన యువతి బంధువర్గం కొత్తగూడెం (తెలంగాణ వాణి) జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఓ జిరాక్స్ షాప్ నిర్వాహకుడి పైత్యం వెలుగులోకి వచ్చింది. బాబుక్యాంప్ పరిధిలో ఉన్న ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు తన షాప్ కు వచ్చిన యువతితో అసభ్యంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ కోసం వచ్చిన యువతిని తాకరాని చోట తాకుతూ నీకేం కావాలన్న ఫ్రీగా చేస్తా నాతో ఫ్రీగా […]
అన్ని శాఖల సమన్వయంతో విజయవంతముగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

డిఐఈఓ ను అభినందన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినందుకు డీ ఐ ఈ వో తిరుమల పూడి రవికుమార్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో డిఐఈఓ తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా […]