UPDATES  

ములుగు జిల్లాలో విషాదం

గన్ తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య ములుగు (తెలంగాణ వాణి బ్యూరో) ములుగు జిల్లా వాజేడు మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాజేడు మండల సమీపంలోని మండపాక వద్ద ఉన్నటువంటి రిసార్ట్ రూములో తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. నలుగురికి ధైర్యం చెప్పాల్సిన ఎస్సై ఇలా […]

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య […]

మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి

సంతాపం తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. కాగా ఊకే అబ్బయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో బూర్గంపాడు నుంచి, 1994, 2009 లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అటు బూర్గంపహాడ్, ఇటు ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివని, అబ్బయ్య ఆత్మకు పవిత్ర శాంతి చేకూరాలని […]

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి స్పెషల్ కరస్పాండెంట్) లగచర్లలో కలెక్టర్ పై దాడి యత్నం ఘటన కేసులో హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌ లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌ తోపాటు ఇతర అధికారులపై స్థానికులు దాడికి యత్నించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిపై ప్రాథమికంగా ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ […]

పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ మాయాజాలం

MRP కంటే అధిక ధరలకు విక్రయాలు పాల్వంచ (తెలంగాణ వాణి) పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ సూపర్ మార్కెట్ నిత్యావసరాల కోసం వెళ్లే వినియోగదారులను దారుణంగా మోసం చేస్తుంది. MRP కంటే తక్కువకు అమ్మాల్సిన రిలయన్స్ మార్ట్ లో MRP కన్నా అధిక ధరలకు విక్రయిస్తు సామాన్యుణ్ణి బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయించడం అనేది నేరమని తెలిసి కూడ ఇలా అమ్మడం ఏంటని అడిగిన వినియోగదారుడికి వ్యత్యాసం ఉన్న డబ్బులు తిరిగి ఇస్తామని ఇవన్నీ […]

సామాజిక వేత్త, రక్తదాన సంధానకర్తకు అవార్డు

ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవారత్న 2024 అవార్డు పురస్కారం కోరుట్ల (తెలంగాణ వాణి) అంజలి మీడియా గ్రూప్, అందరి టీవీ పదవ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కాకతీయ మహానంది 2024 అవార్డుల ప్రధానోత్సవం హన్మకొండలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ సామాజికవేత్త, రక్తదాన సంధాన కర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు జాతీయ సేవా రత్న- 2024 అవార్డు చైర్మన్ కామిశెట్టి రాజు అందజే శారు. చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ […]

బెస్ట్ సిటిజన్ పోలీస్ అవార్డు అందుకున్న ధర్మారం ఎస్సై

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శీలం లక్ష్మణ్ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా బుధవారం సాయంత్రం అవార్డు అందుకున్నారు. రాష్ట్ర బెస్ట్ సిటిజన్ పోలీస్ గా 5వ ర్యాంక్ రావడం అది రామగుండం కమిషనరెట్ పరిధిలోని ధర్మారం మండలానికి రావడం చాలా సంతోషకారమని స్తానికులు అన్నారు. ఎస్సై లక్ష్మణ్ కు అవార్డు రావడం పట్ల స్థానిక నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.

టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి లను అరెస్టు చేయాలి : గాయత్రి బెహరా

గుంటూరు (తెలంగాణ వాణి కరస్పాండెంట్) స్థానిక అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి లపై ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సొసైటీ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు గాయత్రి బెహరా మాట్లాడుతూ తిరుమల తిరుపతి క్షేత్రానికి ప్రపంచంలోనే విశిష్ట గుర్తింపు ఉందని, తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన తిరుపతి లడ్డు […]

యూట్యూబ్ వీడియోస్ పేరిట ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన మరో సంస్థ

కోట్లు నొక్కేసి కుంటి సాకులు చెబుతున్నారంటు బాధితుల ఆవేదన ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులు, యువతే టార్గెట్ గా కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి […]

ఢిల్లీ సీఎంగా అతిషి

తెలంగాణ వాణి (స్పెషల్ కరస్పాండెంట్) రాజధాని ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న సందేహం కలిగింది. ఈ క్రమంలో అతిషీ, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేర్లు వినిపించాయి. చివరకు మంత్రి అతిషీకి ముఖ్యమంత్రి […]