UPDATES  

 బిజెపి మండల కార్యాలయాన్ని ప్రారంభించిన పైడి ఎల్లారెడ్డి

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు నీలం చిన్నరాజులు

నాగిరెడ్డిపేట మండలం ఆగస్టు 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నూతన బిజెపి పార్టీ కార్యాలయాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు . ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు పాల్గొన్నారు . నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి మండల బిజెపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు . ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… బిజెపి కార్యాలయాన్ని మన మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని చాలా రోజులు ఆలోచన కాబట్టి నేటితో పూర్తయిందని సంతోషపడ్డారు . పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్టీ సమావేశాలను ఇంతకుముందు బయట ప్రాంతాలలోని ప్రకృతిలో సమావేశం పెట్టుకునేది . పార్టీ సమావేశాలకు నేడు కార్యాలయం ఏర్పాటు మండల నాయకులు కార్యకర్తలు బాగా కృషి చేసినట్లు తెలిపారు . గత కొంతకాలం క్రితం నాగిరెడ్డిపేట గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు కొన్ని అడ్డంకులు ఎదురవడంతో ప్రతిష్టాపనకు కొంచెం అంతరాయం ఏర్పడింది కానీ ఇప్పుడు అలాంటి అడ్డంకులు ఏమీ లేవు త్వరలోనే భూమి పూజ చేసి విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే మొత్తం గ్రామ పరిధిలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయబోతున్నామని తెలిపారు . ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి స్థల పూజలు చేసినట్లు అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు, గద్దెలను ఏర్పాటు చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు . బిజెపి సిద్ధాంతం ఏమిటంటే ధర్మం వైపు నడవడం అన్నారు ‌. శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని సమావేశంలో తెలుపుతూ, శివాజీ మహారాజు యొక్క గొప్పతనాన్ని కొనియాడారు .

అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ… నేడు కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా లక్షల నకిలీ ఓటరు తొలగించే ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు . నకిలీ ఓటర్లుగా తొలగించిన దానిలో మరికొందరికి అవకాశం కల్పించి, తప్పొప్పులను సరిచేసి ఓటు హక్కును కల్పించే విధంగా ప్రణాళికలు కొనసాగుతున్నయని తెలిపారు . గత కొంతకాలంగా రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు రాంచందర్రావు *ఫీజుల బకాయి- బిజెపి లడాయి* కార్యక్రమంలో భాగంగా నిరాహారదీక్ష చేశారని గుర్తు చేశారు . గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ద్వారా మూడు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను మభ్యపెట్టి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 13 వేల కోట్లకు పైగా బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును పాడు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు . విద్యార్థులకు ఎలాంటి అన్యాయం చేయాలని ప్రభుత్వం చూసినా ఎక్కడికక్కడ నిరసనలు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు వెంటనే బకాయి నిధులను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు పాటుపడాలని తెలిపారు . ఉన్నత విద్య కోసం పొరుగు దేశాలకు వెళ్లి విద్యను అభ్యసించి వచ్చనా విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల కావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు . కామారెడ్డి జిల్లాలోని 36 మండలాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండగా నిలుస్తామని తెలిపారు . స్పెషల్ ఇంటెన్షిప్ ద్వారా మొదటి విడత పూర్తయినప్పటికీ రెండో విడత ప్రారంభమైంది . ఇందులో గాను 274 బూతు లెవల్లో బిఎల్వోలు సమిష్టి కృషితో ఎస్సీఆర్ ప్రక్రియ విజయవంతం అవుతుందని కొనియాడారు . ఇట్టి కార్యక్రమంలో భాగంగా జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గరిగే రవీందర్రావు మండల అధ్యక్షులు శ్రీనివాస్, బిజెపి నేతలు రామ్మోహన్ రెడ్డి, దేవేందర్, హనుమాన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 31 August 2026, 9:57 am Posted by : TELANGANA VANI

బిజెపి మండల కార్యాలయాన్ని ప్రారంభించిన పైడి ఎల్లారెడ్డి

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు నీలం చిన్నరాజులు

నాగిరెడ్డిపేట మండలం ఆగస్టు 30 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నూతన బిజెపి పార్టీ కార్యాలయాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు . ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు పాల్గొన్నారు . నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి మండల బిజెపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు . ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బిజెపి కార్యాలయాన్ని మన మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని చాలా రోజులు ఆలోచన కాబట్టి నేటితో పూర్తయిందని సంతోషపడ్డారు . పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పార్టీ సమావేశాలను ఇంతకుముందు బయట ప్రాంతాలలోని ప్రకృతిలో సమావేశం పెట్టుకునేది . పార్టీ సమావేశాలకు నేడు కార్యాలయం ఏర్పాటు మండల నాయకులు కార్యకర్తలు బాగా కృషి చేసినట్లు తెలిపారు . గత కొంతకాలం క్రితం నాగిరెడ్డిపేట గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపనకు కొన్ని అడ్డంకులు ఎదురవడంతో ప్రతిష్టాపనకు కొంచెం అంతరాయం ఏర్పడింది కానీ ఇప్పుడు అలాంటి అడ్డంకులు ఏమీ లేవు త్వరలోనే భూమి పూజ చేసి విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే మొత్తం గ్రామ పరిధిలో శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన చేయబోతున్నామని తెలిపారు . ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి స్థల పూజలు చేసినట్లు అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు, గద్దెలను ఏర్పాటు చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు . బిజెపి సిద్ధాంతం ఏమిటంటే ధర్మం వైపు నడవడం అన్నారు ‌. శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని సమావేశంలో తెలుపుతూ, శివాజీ మహారాజు యొక్క గొప్పతనాన్ని కొనియాడారు .

అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ... నేడు కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా లక్షల నకిలీ ఓటరు తొలగించే ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు . నకిలీ ఓటర్లుగా తొలగించిన దానిలో మరికొందరికి అవకాశం కల్పించి, తప్పొప్పులను సరిచేసి ఓటు హక్కును కల్పించే విధంగా ప్రణాళికలు కొనసాగుతున్నయని తెలిపారు . గత కొంతకాలంగా రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు రాంచందర్రావు ఫీజుల బకాయి- బిజెపి లడాయి కార్యక్రమంలో భాగంగా నిరాహారదీక్ష చేశారని గుర్తు చేశారు . గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ద్వారా మూడు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయకుండా విద్యార్థులను మభ్యపెట్టి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 13 వేల కోట్లకు పైగా బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును పాడు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు . విద్యార్థులకు ఎలాంటి అన్యాయం చేయాలని ప్రభుత్వం చూసినా ఎక్కడికక్కడ నిరసనలు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు వెంటనే బకాయి నిధులను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు పాటుపడాలని తెలిపారు . ఉన్నత విద్య కోసం పొరుగు దేశాలకు వెళ్లి విద్యను అభ్యసించి వచ్చనా విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల కావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు . కామారెడ్డి జిల్లాలోని 36 మండలాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండగా నిలుస్తామని తెలిపారు . స్పెషల్ ఇంటెన్షిప్ ద్వారా మొదటి విడత పూర్తయినప్పటికీ రెండో విడత ప్రారంభమైంది . ఇందులో గాను 274 బూతు లెవల్లో బిఎల్వోలు సమిష్టి కృషితో ఎస్సీఆర్ ప్రక్రియ విజయవంతం అవుతుందని కొనియాడారు . ఇట్టి కార్యక్రమంలో భాగంగా జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గరిగే రవీందర్రావు మండల అధ్యక్షులు శ్రీనివాస్, బిజెపి నేతలు రామ్మోహన్ రెడ్డి, దేవేందర్, హనుమాన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest