తల్లాడ మేజర్ పంచాయతీలో వనమహోత్సవం

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి): తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వనమహోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ,హరితహారం లక్ష్యంగా మండల కేంద్రంలో విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ఉమా, తాసిల్దార్ టీ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, తల్లాడ గ్రామ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ […]
తూమ్ చౌదరి పార్టీ మారుతున్నారన్న ప్రచారం అవాస్తవం

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నిలిపివేయాలి.. కొత్తగూడెం కాంగ్రెస్ హెచ్చరిక కొత్తగూడెం, ఆగస్టు 25 (తెలంగాణ వాణి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తూమ్ చౌదరి సీపీఐ వైపు చూస్తున్నారంటూ కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం, నిరాధారమైనదని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం తరఫున పూణెం శ్రీనివాస్, ఎండి గౌస్ పాషా ఒక ప్రకటన విడుదల చేశారు. […]
ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ -జేఏసీ డిమాండ్ కొత్తగూడెం ( తెలంగాణ వాణి) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ – జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మహాధర్నాకు సంబంధించిన నోటీసును అందజేశారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, […]
విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించిన రాజమౌళి- అరుణ దంపతులు

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జైన రాజమౌళి- అరుణ దంపతులు సోమవారం ధర్మారం మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న 170 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయడానికి విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ బహుకరించి ఉదారత చాటుకున్నారు. వీరు గతంలో స్కూల్ డే కు ఆర్థిక సహాయం చేశారని ఈ దంపతులు ఇరువురికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు హెచ్ఎం ఎస్ మల్లారెడ్డి తెలిపారు. రాబోయే కాలంలో వీరు […]
ఇందిరమ్మ మోడల్ కాలనీలో విక్రయాలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మొదటి వార్డ్ అయిన జక్కన్న పల్లి గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకు 2008లో ఇందిరమ్మ మోడల్ కాలనీ ఏర్పాటు చేసి 42 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు కేటాయించడం జరిగింది, కొంతమంది లబ్ధిదారులు కొంతమేరకు నిర్మాణాలు చేసి మధ్యలోనే నిర్మాణాలునిలిపి వేశారు. ఇంకొందరు ఎలాంటి నిర్మాణాలు చేయకుండా అలాగే వదిలేశారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు స్థలాలు పొందిన లబ్ధిదారులు వారికి కేటాయించిన […]
చిరుత చర్మం.. 17 గోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్

విక్రయానికి యత్నించిన నలుగురు అరెస్ట్ భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు యత్నించిన నలుగురు వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ఎండిన చిరుతపులి చర్మం, 17 గోర్లు, ఒక చిన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబందించిన వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బూర్గంపహాడ్ ఎస్‌ఐ ఈ. నాగబిక్షం ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఉదయం […]
జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం..
జర్నలిస్టు కాలనీకి మౌలిక సదుపాయాలు త్వరలో కల్పిస్తాం.. ప్రజా పాలన ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు వేములవాడ,ఆగస్టు 23 (తెలంగాణ వాణి ప్రతినిధి) : జర్నలిస్టు కాలనీలో మౌలిక సదుపాయాలను త్వరలోనే కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ఆదివారం మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆరో వార్డు కౌన్సిలర్ కాస శ్రీనివాసులతో కలిసి నాంపల్లి శివారులోని జర్నలిస్టు కాలనీని వారు సందర్శించారు.వేములవాడ […]
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు

ఖమ్మం (తెలంగాణ వాణి) ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును పార్టీ ముందస్తుగా ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించిన ఆయన.. తెలంగాణ […]
ఒకే వేదికపై రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న తండ్రీ కన్నా కూతురు పారుల్
కొత్తగూడెం:ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో జరిగిన రాష్ట్రస్థాయి అవార్డుల కార్యక్రమంలో తెలంగాణకు చెందిన తండ్రీకూతురు ఒకే వేదికపై అవార్డులు అందుకోవడం అభినందనీయమని ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపక అధ్యక్షులు మొక్కల కె.ఎన్. రాజశేఖర్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం చెందిన ప్రముఖ రక్తదాత కన్నా,ఆయన కుమార్తె పారుల్ అవార్డులు అందుకున్నారు. కన్నా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూనే అత్యవసర పరిస్థితుల్లో వేలాది మందికి రక్తదానం చేశారు. ఆయన కుమార్తె పారుల్ ప్రకృతి హరిత దీక్షలో భాగంగా వందలాది […]
అత్యాధునిక ఎక్మో చికిత్సతో 23 ఏళ్ల యువతికి పునర్జన్మ

తీవ్ర గుండె వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో చేరిన యువతిని కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు కరీంనగర్, ఆగస్టు 22 (తెలంగాణ వాణి) తీవ్రమైన గుండె వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 23 ఏళ్ల యువతికి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) చికిత్స అందించి విజయవంతంగా ప్రాణాలు కాపాడారు. పెరిపార్టమ్ కార్డియో మయోపతి కారణంగా యువతి తీవ్ర గుండె వైఫల్యానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో యువతి పరిస్థితి […]