మనుబోతులపాడు ఘటనపై అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ డిమాండ్

సుజాతనగర్, (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామపంచాయతీ పరిధిలోని వేములూరు గ్రామంలో పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులపై అటవీ అధికారులు దాడికి పాల్పడ్డారని, దీనిని బీఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడ్యా సత్యనారాయణ నాయక్ తీవ్రంగా ఖండించారు. గత 30 ఏళ్లుగా సాగులో ఉన్న సుమారు 35 హెక్టార్ల పోడు భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో అధికారులు మహిళా రైతులపై దాడి చేశారని, ఈ ఘటనలో పలువురు […]
ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్

ఫోక్సో కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన కొత్తగూడెం డీఎస్పీ కొత్తగూడెం, జూలై 15 (తెలంగాణ వాణి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైన ఓ పోక్సో (POCSO) కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ వెల్లడించారు. బుధవారం 2టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు […]
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ఇంట్లో మంచం కింద భారీగా నోట్ల కట్టలు పెద్దపల్లి (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్‌ను ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సతీష్ కుమార్ పెద్దపల్లి పట్టణంలోని తెనుగు వాడ హిందూ శ్మశానవాటిక అభివృద్ధి, కునారం రోడ్డులోని శ్మశానవాటిక అభివృద్ధి పనులు (ప్యాకేజీ-IX) కు సంబంధించిన […]
సాంబమూర్తి గర్భగుడిలో శ్వేత నాగు

భక్తుల ప్రత్యేక పూజలు ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి గ్రామంలో పురాతన సాంబమూర్తి దేవాలయంలోని గర్భగుడిలో ఆదివారం తెల్లటి శ్వేత నాగుపాము దర్శనమిచ్చింది. ఆదివారం ఉదయం దేవాలయానికి పూజలు చేసేందుకు వెళ్లిన పూజారికి ఆలయం గర్భగుడిలో నాగసర్పం ఉన్న విగ్రహాలకు ఎదురుగా నాగుపాము ఉండటం చూసిన పూజారి కొంత భయాందోళనకు గురయ్యారు. స్థానిక సర్పంచ్ సూర రజిత వెంకటేశం, కొండగట్టు ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ కొలుముల దామోదర్ తో […]
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్‌లోకి వెళ్లను

పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ రైతు భరోసా, బోనస్, యూరియా అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు బీఆర్ఎస్ ఖాతాలోని రూ.1,400 కోట్లను అమరవీరుల కుటుంబాలకు పంచాలి కొత్తగూడెంలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు కొత్తగూడెం, జూలై 9 (తెలంగాణ వాణి) బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల నిధులను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పంపిణీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. […]
లారీబోల్తా వాహనాల రాకపోకలకు అంతరాయం

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ బస్టాండ్ సమీపలో మంగళవారం రాత్రి 10 గంటలకు లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలీలా ఉన్నాయి. మంగళవారం రాత్రి 10 గంటలకు మంచిర్యాల వైపునుండి కరీంనగర్ వైపు లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి వెల్లడంతో లారీ రైట్ సైడ్ రోడ్డు కిందకు వెళ్ళుతున్న క్రమంలో తెరుకున్న డ్రైవర్ వెంటనే లారిని రోడ్డు ఎక్కించే ప్రయత్నంలో లారీ బోల్తా పడిందని చెపుతున్నారు. ఈ ఘటనలో […]
తప్పిన ప్రమాదం రాకపోకలకు అంతరాయం

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ధర్మానం వైపు నుండి కరీంనగర్ వైపు లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బ్రిడ్జి డివైడర్ ను ఢీకొని స్టీరింగ్ విరిగిపోయి రోడ్డు మీద నిలిచిపోయింది. లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ బ్రిడ్జిపై మూడు గజాల వెనక్కి ఈ ప్రమాదం జరిగితే లారీ పూర్తిగా ఎస్సారెస్పీ పెద్ద కాలువలో […]
ఈరోజు నుండి ఆరుద్ర కార్తె ప్రారంభం
తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు తెలంగాణ వాణి : 22 _ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే.వాతావరణం చల్లబడి,తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి.వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి.రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి.అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు…_ _ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి ఓ 30 ఏళ్లు పైబడిన […]
వర్కర్స్ కు గొడుగులు పంపిణీ చేసిన రిటైర్ సీనియర్ అసిస్టెంట్ చింత గణేష్
హైదరాబాద్: ఇఎఫ్ఎల్యూ (ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో 32 సంవత్సరాలు సేవలందించి సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయిన చింత గణేష్ శుక్రవారం యూనివర్సిటీలో పనిచేస్తున్న వర్కర్స్‌కు గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో గార్డెనింగ్, ఆఫీస్ తదితర విధులు నిర్వహించే ఉద్యోగులు వర్షం నుంచి రక్షణ పొందేందుకు గొడుగులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయన చూపిన చొరవను సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ బేగం, నర్సమ్మ, శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్, […]
ఖమ్మం గుమ్మంలో దొంగల హల్చల్

సినీ ఫక్కిలో సోనోవిజన్ షోరూమ్ ను గుల్ల చేసిన దొంగల ముఠా పోలీసులు వచ్చేలోపు కారులో పరారు ఖమ్మం (తెలంగాణ వాణి) ఖమ్మం నగరంలో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. జడ్పీ సెంటర్‌లో ఉన్న సోనోవిజన్ మొబైల్ స్టోర్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తెల్లవారుఝామున భారీ దోపిడీకి పాల్పడ్డారు. సుమారు రూ.80 లక్షల విలువైన ఖరీదైన సెల్‌ఫోన్లను అపహరించి పరారైనట్లు తెలుస్తుంది. దొంగలు స్టోర్‌లోకి ప్రవేశించిన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అలారం మోగడంతో […]