రోడ్డు పక్కన బడ్డీ కొట్టులో టీ తాగిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇందిరమ్మ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్తగూడెం (తెలంగాణ వాణి) రెండు సార్లు జెడ్పిటీసీ, మాజీ జెడ్పి చైర్మన్, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కూడ ఎటువంటి అధికారం దర్పం చూపడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. తన నియోజకవర్గ ప్రజలే కాక ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల ఉన్న ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఆయన సొంతం. ఇంతకు ఆయన మరెవరో కాదు ప్రస్తుత ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. అధికార పార్టీ […]
తెలంగాణ సాంస్కృతిక సారధికి మెమోరాండం

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం రోజున తెలంగాణ సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు జి వెన్నెలకు మెమోరాండం సమర్పించిన కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరుపోతుల సంపత్, జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, అనంతరం వారు మాట్లాడుతూ తమరి ద్వారా ఆర్బిఐ గవర్నర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖలు రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జే పరుశురాం పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని మిగిద్దో మినిస్ట్రీస్ చర్చికితో పాటు పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇతరుల పట్ల ప్రేమ సహనం శాంతి సేవాభావం ద్రాత్రుత్వమనే సుగుణాల ఆచరణలో మానవాళిని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు […]
పట్టుబడ్డ ట్రాక్టర్ మాయం

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన ఫారెస్ట్ సిబ్బంది లక్ష్మిదేవిపల్లి (తెలంగాణ వాణి) అనిశెట్టిపల్లి ముర్రేడు వాగులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడ్డ ట్రాక్టర్ విషయంలో ట్విస్ట్ నెలకొంది… లక్ష్మిదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పట్టుకున్నారు. అయితే ఎప్పటి లాగే పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ ను సెంట్రల్ పార్క్ లేదా ఎఫ్.డి.ఓ కార్యాలయంలో ఉంచాల్సి ఉండగా ట్రాక్టర్ ఎక్కడ పెట్టారో తెలియడం లేదు. […]
సినీనటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలి : అఫ్జల్ పఠాన్

మీది అహంకారామా ? అసహనమా ? మీ ఇంటి రచ్చను మీరే రోడ్డున పడేసి మీడియాపై ఆగ్రహం ఎందుకు ? హైదరాబాద్ (తెలంగాణ వాణి) సినీ నటుడు మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ అఫ్జల్ పఠాన్ డిమాండ్ చేశారు. మీడియాపై మంచు మోహన్ బాబు దాడిచేయడం ఆయన విలువను దిగజార్చుతుందని మోహన్ బాబు క్షమాపణ చెప్పకపొతే మీడియా అంటే ఏంటో ఆయనకు తెలిసేలా చేస్తామన్నారు. గత 3 రోజులుగా సినీ ఇండస్ట్రీతో పాటు, 2 […]
ములుగు జిల్లాలో విషాదం

గన్ తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య ములుగు (తెలంగాణ వాణి బ్యూరో) ములుగు జిల్లా వాజేడు మండలం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న రుద్రారపు హరీష్ ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాజేడు మండల సమీపంలోని మండపాక వద్ద ఉన్నటువంటి రిసార్ట్ రూములో తన గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. నలుగురికి ధైర్యం చెప్పాల్సిన ఎస్సై ఇలా […]
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయండి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు డీజేయూ వినతి కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు అయ్యేలా చూడాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కమిటీ కన్వీనర్ సీమకుర్తి రామకృష్ణ, కో-కన్వీనర్ అఫ్జల్ పఠాన్ వినతి పత్రం అందిచారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో, చానళ్ళలో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య […]
కావాలనే కుట్ర చేస్తున్నారు : వనమా రాఘవ

రవిచంద్ర నాయకత్వం లోనే పని చేస్తాం తెలంగాణ వాణిలో వచ్చిన కథనంపై వనమా రాఘవ ఖండన కొత్తగూడెం (తెలంగాణ వాణి ప్రతినిధి) రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం, గత ఎన్నికల్లో మా నాన్న వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం మన ప్రియతమ నాయకులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. ఎన్నికల సమయంలో నిద్రాహారాలు మాని వనమా వెంకటేశ్వర రావు గెలుపు కోసం ఆయన పడ్డ కష్టాన్ని తాను దగ్గరుండి చూసానని వనమా […]
మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి

సంతాపం తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొత్తగూడెం (తెలంగాణ వాణి) ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. కాగా ఊకే అబ్బయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1983లో బూర్గంపాడు నుంచి, 1994, 2009 లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అటు బూర్గంపహాడ్, ఇటు ఇల్లందు నియోజకవర్గాల్లో ఆయన అందించిన సేవలు మరువలేనివని, అబ్బయ్య ఆత్మకు పవిత్ర శాంతి చేకూరాలని […]
జర్నలిస్టుల సంక్షేమానికి ఉద్భవించిందే డీజేయు

డీజేయు ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా వేదికగా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఇళ్లు, ఇళ్ల స్థలాలు సాధనే ధ్యేయంగా అడుగు ముందుకు వేస్తున్నాం జర్నలిస్టుల హక్కుల సాధనకు ప్రత్యేక ఉద్యమం డిజేయు జాతీయ కన్వీనర్ బి. లక్ష్మీనర్సింహా కొత్తగూడెం (తెలంగాణ వాణి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి డీజేయు యూనియన్ కృషి చేస్తుందని సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం టిఎస్ యూటిఎఫ్ కార్యాలయంలో సీమకుర్తి రామకృష్ణ అధ్యక్షతన కో-ఆర్డినేటర్స్ […]