ధర్మారం (తెలంగాణ వాణి)రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థల బందుకు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపత్యంలో ఏఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్మారం మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ విద్యావ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అట్లాగే నీట్ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న వరుస వైఫల్యాలలు, ప్రశ్న పత్రాలు లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కొత్తపల్లి శశివర్ధన్, మామిడి రామ్ చరణ్, పురాణం శ్రీనివాస్, బొంత సంతోష్, బొలి కార్తీక్, కాకాపురం కార్తీక్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు మనోజ్, యుత్ పాల్గొన్నారు.

