యువతి పట్ల జిరాక్స్ షాప్ నిర్వహకుడి వెకిలి చేష్టలు
దేహశుద్ధి చేసిన యువతి బంధువర్గం
కొత్తగూడెం (తెలంగాణ వాణి)
జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఓ జిరాక్స్ షాప్ నిర్వాహకుడి పైత్యం వెలుగులోకి వచ్చింది. బాబుక్యాంప్ పరిధిలో ఉన్న ఓ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు తన షాప్ కు వచ్చిన యువతితో అసభ్యంగా వ్యవహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిరాక్స్ కోసం వచ్చిన యువతిని తాకరాని చోట తాకుతూ నీకేం కావాలన్న ఫ్రీగా చేస్తా నాతో ఫ్రీగా ఉండు అంటూ సదరు జిరాక్స్ నిర్వాహకుడు వెకిలి చేష్టలు చేయడంతో భయాందోళనకు గురైన యువతి అక్కడి వెళ్లిపోయి తమ వాళ్లకు చెప్పటంతో వాళ్లు జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిని చితకబాదినట్టు తెలుస్తుంది.
కాగా యువతి భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని యువతి తరపు వాళ్లు ఎవరు కూడ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం.
Post Views: 558