UPDATES  

NEWS

ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని అభినందించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ రాష్ట్ర స్థాయిలో ఆణిముత్యంలా మెరిసిన నవ్య శ్రీ. జాతీయ స్థాయి పోటీలకు బయలుదేరిన వరంగల్ తైక్వాండో టీం ఐటీసీ నోట్ పుస్తకాలను పంపిణీ చేసిన కొత్తగూడెం మండల విద్యాధికారి డా.యం.ప్రభు దయాల్. బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్: హెచ్.ఎం, బి. నామా నాయక్ గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు. మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టడం హర్షనీయం:సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్. పద్మశ్రీ వనజీవి రామయ్య అకాల మరణా వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను: కె ఎన్ రాజశేఖర్  పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

 జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల పోరుకు వివిధ పార్టీల మద్దతు

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం జర్నలిస్టులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి, మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నవతన్ మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే తీర్చాలని, వారికి ఉచితంగా ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వారి పక్షాన ఆమరణ దీక్ష కైన సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీ నుండి గల్లి దాక నిత్యం సమాజంలో జరిగే కార్యక్రమాలను ప్రజలకు తెలియచేస్తూ చాలిచాలని వేతనాలతో జీవితాన్ని గడుపుతున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలం ఇచ్చి, రు. 5లక్షలు మంజూరు చేయాలన్నారు. తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మల్లెల రామనాధం జర్నలిస్టుల కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల హక్కు అని, వారికి సాధారణ రేట్ తో ఇండ్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.2.30కోట్లు కట్టాలని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అరకొర జీతాలతో సంస్థలలో పనిచేస్తున్న వారికి కోట్ల రూపాయలు చెల్లించాలనడం మూర్ఖత్వమన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికను పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీ రంగా కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టులు గత 10 సంవత్సరాలుగా ఆనేక ఉద్యమాలు చేస్తున్నారని, కానీ ఎకరానికి రూ.2.30కోట్లు చెల్లించలనడం దుర్మార్గమని, వారికి పూర్తిగా ఉచితంగా స్థలం ఇవ్వాలని అదే విధంగా పీఎం ఆవాస్ యోజన పథకం వర్తింపచేయాలిని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీజేపీ అగ్ర నాయకుల దృష్టికి తీసుకు వెళతానని జర్నలిస్టు లకు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్, రాయుడు నాగేశ్వర్ రావు, సీనియర్ జర్నలిస్టు లు జనుమల రమేష్, కల్లోజీ శ్రీనివాస్ , టీవీ నాగ చారి, వి. సతీష్, జాన్సన్, సింగం అరుణ్ కుమార్, బి రాందాస్, కే శ్రీనివాస్, జోగాం తారక్, వట్టికొండ రవి, ఇళ్ళందుల దుర్గ, కొట్టే శివ శంకర్ ప్రభాకర్ రెడ్డి, రాము, ప్రవీణ్, కృష్ణారావు, రుద్ర రాజ శేఖర్, పోలిశెట్టి రాజశేఖర్, వీరు నాయక్, అఫ్జల్ పఠాన్, ఈశ్వర్, పురం శ్రీనివాస్, పిట్టల రమేష్, ఆనంద్, చింతల చిరంజీవి, బీర రవి, ఖాజా, సత్య ప్రకాష్ నాగరాజు, తాండ్ర రాజ్ కుమార్, గొర్ల సురేష్, వెన్నం సతీష్, చింతల వెంకటనర్సింహారావు, కోడూరి సూర్య, మహంకాళి కనకరావు, కోటేష్ యాదవ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest