UPDATES  

NEWS

రచ్చపల్లిలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ వారి ఆదేశాలనుసారం నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం రచ్చపెల్లి గ్రామంలో నిర్వహించారు. ఇందు లో భాగంగా రాజమహేంద్రవరం భూపతి బ్రదర్స్ కళాజాత బృందం వారిచే వీధి నాటిక జానపద గీతాలు, మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అవగాహన తెలియపరుస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక బ్రాంచ్ లలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు […]

సి.పి.ఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్

పాల్వంచ మండలం జెడ్పీ.హెచ్‌.ఎస్ పునుకుల పాఠశాలలో సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సి పి ఎస్ సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించిన అనంతరం ఉపాద్యాయులు మాట్లాడుతూ..సి.పి.ఎస్ వల్ల తమ భవిష్యత్ భద్రతకు భంగం కలుగుతోందని,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీహరి,పాఠశాల సిబ్బంది సుజాత,అనురాధ, ప్రమీల,శ్రీపల్లవి,సునీత, బాల్య, రగ్యా,ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇస్తున్నా ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక లక్ష్మీదేవి పల్లి గ్రామ పంచాయితీలో రోడ్ల వెంబడి చెత్త,కాలువలు తీసిన మట్టి కుప్పలు మరియు ఇంటింటి నుండి చెత్త సేకరించడం వంటి పారిశుధ్య కార్మికులు మరియు పంచాయితీ సిబ్బంది పని తీరు బాగుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇవ్వాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అవగాహన కల్పిస్తున్న పంచాయతీ సర్పంచ్ తాటి అనిత మరియు ఉప సర్పంచ్ పాంచనపరుపు మహేష్,కార్యదర్శి సాంబయ్య […]

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్

కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్. దేశంలోనే ఏకైక ఏజెన్సీ B.Ed కళాశాల భద్రాచలం ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు.. ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరగేంట్రం… విశ్వసనీయ వర్గాల సమాచారం -5 వ డివిజన్ లో ఓటు హక్కు

తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి

సంగారెడ్డి జనవరి 21, (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని స్థానిక డిఎస్పి కార్యాలయంలో బుధవారం తెలంగాణవాణి దినపత్రిక క్యాలెండర్ ను నారాయణఖేడ్ డిఎస్పి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి మీడియా సంస్థల సేవలను ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ ఆంజనేయులు, పాటిల్ ఉదయ్ కుమార్, షేక్ ఫయాజ్, ఇబ్రహీం ఖాన్ […]

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం (UPA) ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బిక్షపతి, ATEC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సోమయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పామర్తి అంకినీడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు లోగాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజ్ మోహన్‌లు క్యాలెండర్‌ను ఆవిష్కరించగా, అనంతరం వాటిని జిల్లా కమిటీ […]

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టి పి టి ఎఫ్ మండల అధ్యక్షుడు బి.సుక్య

పాల్వంచ మండలం మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని లో టిపిటిఎఫ్ పాల్వంచ మండల అధ్యక్షుడు బర్మావత్ సుక్య ఆధ్వర్యంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన పాఠశాల హెచ్ఎం యన్.చందు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని, పండిట్, పిఈటి పోస్టులను అప్‌గ్రేడేషన్ చేసి పదోన్నతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఎస్.బాలు,ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం పి.వెంకటేశ్వర్లు,బి.శంకర్,పి.స్వరూప రాణి,ఎస్.బాలు ఇ.పద్మావతమ్మ, ఇంగ్లీష్ బాలు,డి.సతీష్ […]

సర్పంచ్ కె.రవి ను సన్మానం చేసిన సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్‌

ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కుంజ రవి ను బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్ నివాసానికి ఆహ్వానించి, ఆయన బృంద సభ్యులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ గ్రామాభివృద్ధిపై చర్చించారు.

కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

కిన్నెరసాని గ్రామపంచాయతీ పరిధిలో కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ – సీజన్ 3 ను దివంగత వజ్జ విద్యాసాగర్ జ్ఞాపకార్థం ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను కిన్నెరసాని గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో కిన్నెరసాని క్రికెట్ టీం మెంబెర్స్ ఉత్సాహంగా ఆడి అలరించారు.ఈ కార్యక్రమంలో బొర్ర ఉదయ్,షేక్ ఆరిఫ్,వజ్రా వినయ్,పడిగా లోకేష్ తదితరులు పాల్గొని టోర్నమెంట్‌కు విశేష సహకారం అందించారు. గ్రామ యువత క్రీడల […]

మహిళల కళలకు వేదికగా ముగ్గుల పోటీలు

కిన్నెరసాని గ్రామ పంచాయతీలో మహిళలలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ వజ్జ రామకృష్ణ,ఉపసర్పంచ్ వజ్జ ఇంద్రజా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ మహిళల సృజనాత్మకతను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.మొదటి బహుమతి తాటి రామ, ద్వితీయ బహుమతి బోనగిరి శ్రీలత, తృతీయ బహుమతి బుడగం హేమలతలకు దక్కాయి. బహుమతులను […]