UPDATES  

NEWS

 రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు : లాల్ సింగ్ నాయక్

సుజాతనగర్, అక్టోబర్ 23 (తెలంగాణ వాణి) రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు లాల్ సింగ్ నాయక్ సూచించారు. రైతులు నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామ పరిధిలోని మంజీత్ కాటన్ మిల్లులో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లాల్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పత్తిని పూర్తిగా ఆరబెట్టి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పరీక్షలు, తూకం ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలని, రైతులకు అనవసరమైన నిరీక్షణ లేకుండా చూడాలని సూచించారు. రైతులకు కొనుగోళ్లకు సంబంధించిన నిబంధనలు, అవసరమైన పత్రాలపై అధికారులు స్పష్టమైన సమాచారం అందించాలని పేర్కొన్నారు. పత్తి విక్రయానికి వచ్చే రైతులకు సహకరించి, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, కొత్తగూడెం పీఏసీఎస్ చైర్మన్ మండే వీర హనుమాన్ రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, సీసీఐ బయ్యర్ సింహాద్రి నాయుడు, సీపీఐ మండల కార్యదర్శి భూక్య బద్రు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు అజ్మీర్ ఆమ్రు, మాలోత్ అశోక్ బాబు, సపావత్ రవి, వాడే లక్ష్మి, జోగా రామయ్య, తేజావత్ రవికుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎం.డి. హిమాయత్ హుస్సేన్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 24 October 2026, 8:06 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest