ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ఆశాస్త్రీయంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ అన్యాయం పట్ల నేతకానిలు చేపట్టిన పోరుబాటలో భాగంగా నవంబర్ 15న హలో నేతకాని – చలో ఉస్మానియా కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని ప్రోగ్రాం కన్వీనర్ నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత తెలిపారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నేతకాని కుల సంఘం మండల అధ్యక్షులు రాగుల మల్లేష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సన్నాక సమావేశానికి ప్రసాద్ నేత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణలో నేతకానిలు ఏ విధంగా నష్టపోయారో వివరించారు. ప్రభుత్వాలు స్పందించే విధంగా తమకు న్యాయం జరిగే దిశగా కార్యక్రమాలు చేపడుతూ నేతకాని సమాజాన్ని చైతన్య పరిచి ఉద్ధృతంగా ఉద్యమాలు నిర్వహించబోతున్నట్లు వివరించారు. దానిలో భాగంగా హలో నేతకాని చలో ఉస్మానియా కార్యక్రమానికి ధర్మారం మండల నేతకానికుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తద్వారా చైతన్యవంతమై భవిష్యత్తు ఉద్యమాలకు పాటుపడాలని కోరారు. 2002లో చేపట్టిన ఎస్సీ కులాల వర్గీకరణ ఏబిసిడి అను నాలుగు గ్రూపులుగా విభజించబడినప్పుడు 2024 వర్గీకరణలో1,2,3 అని మూడు గ్రూపులుగా ఎందుకు విభజించారో తెలుపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే నని ప్రశ్నించారు. ఇలాంటి అనేక అంశాలను చలో ఉస్మానియాలో చర్చించబోతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కార్యక్రమ వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాస్, కో కన్వీనర్ జాడి గంగాధర్, ధర్మారం మండల అధ్యక్షులు రాగుల మల్లేష్,వార్డ్ సభ్యులు దుర్గం అంజి, సీనియర్ నాయకులు గోగు దేవేందర్, గంధం అంజి తదితరులు పాల్గొన్నారు.




