UPDATES  

NEWS

తల్లి-తండ్రుల పేరిట డప్పు కళాకారులకు దుస్తుల పంపిణీ బీజేపీ విజయం.. బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధికి మహా పాదయాత్ర పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక! తడ్కల్ లో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బోస్లే మోహన్ రావు పటేల్ ప్రత్యేక పూజలు బాపూజీ శాఖ గ్రంధాలయానికి పుస్తకాలు బహుకరణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన సాయి మణికంఠ విద్యార్తులు నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

 పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక!

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – జొన్నల రవీందర్

పెద్దపల్లి (తెలంగాణ వాణి జిల్లా ప్రతినిధి) అంపెద్దపల్లి జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పి ఆర్ టి యు టి ఎస్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జొన్నల రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్గొండలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో 2026–2028 కాలానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించగా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జొన్నల రవీందర్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా జొన్నల రవీందర్ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించి, ప్రోత్సహించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్, అంతర్గాం మండల అధ్యక్షుడు కందుల సతీష్, ప్రధాన కార్యదర్శి ముడుసు లక్ష్మణ్‌తో పాటు యూనియన్ సీనియర్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, విద్యారంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జొన్నల రవీందర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు అభినందనలు తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 18 October 2026, 5:59 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest