UPDATES  

NEWS

 బస్టాప్‌లు బండ్ల కోసమా.. ప్రయాణికుల కోసమా?

బస్టాప్‌లను ఆక్రమిస్తున్న ద్విచక్ర వాహనాలు

ఎండ, వర్షంలో రోడ్డుపైనే నిరీక్షిస్తున్న ప్రయాణికులు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి):

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్టాప్‌లు ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే కొందరు వాహనదారులు తమ బైక్‌లను బస్టాప్‌లలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

వర్షం వచ్చినా, ఎండ తీవ్రంగా ఉన్నా బస్టాప్‌లలో కూర్చునే అవకాశం లేకపోవడంతో బస్సుల కోసం ఎదురుచూసే మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

“బస్టాప్‌లు బండ్ల కోసం ఏర్పాటు చేశారా? లేక ప్రయాణికుల సౌకర్యం కోసమా?” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బస్టాప్‌లలో వాహనాల పార్కింగ్‌ను నిరోధిస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 6 August 2026, 3:08 pm Posted by : TELANGANA VANI

బస్టాప్‌లు బండ్ల కోసమా.. ప్రయాణికుల కోసమా?

బస్టాప్‌లను ఆక్రమిస్తున్న ద్విచక్ర వాహనాలు

ఎండ, వర్షంలో రోడ్డుపైనే నిరీక్షిస్తున్న ప్రయాణికులు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి):

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్టాప్‌లు ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలాలుగా మారుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే కొందరు వాహనదారులు తమ బైక్‌లను బస్టాప్‌లలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

వర్షం వచ్చినా, ఎండ తీవ్రంగా ఉన్నా బస్టాప్‌లలో కూర్చునే అవకాశం లేకపోవడంతో బస్సుల కోసం ఎదురుచూసే మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డుపైనే నిలబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

"బస్టాప్‌లు బండ్ల కోసం ఏర్పాటు చేశారా? లేక ప్రయాణికుల సౌకర్యం కోసమా?" అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బస్టాప్‌లలో వాహనాల పార్కింగ్‌ను నిరోధిస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest