UPDATES  

NEWS

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం… వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం

 బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు….

బహుముఖ ప్రజ్ఞాశాలి శారద ఇకలేరు…

– సీనియర్ పాత్రికేయుడి మాతృమూర్తి మృతి…

వేములవాడ,జూన్ 11(తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) 

బహుముఖ ప్రజ్ఞాశాలి శారదమ్మ ఇకలేరు సికింద్రాబాద్ లోని గుండా ఈశ్వరయ్య పాఠశాలలో తన విద్యాభ్యాస్యాన్ని ప్రారంభించింది. వేములవాడ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె అలవోకగా వేలాది పద్యాలను చెప్పగలరు, శాస్త్రీయ సంగీతం లో ఆమెకు తెలియని రాగాలు, లయలు లేవు. ఆమె గొంతు లేత మావి చిగురు తిన్న కోకిల గానంలా ఉంటుంది. అమ్మ లేని లోటు మిత్రుడు గౌతమ్ బాబుకే కాదు మా అందరికీ లోటు.వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఇట్టేడు గౌతమ్ బాబు మాతృమూర్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇట్టేడు శారద(85) బుధవారం మృతి చెందారు. పట్టణంలోని వైకుంఠధామంలో ఆమె అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖుల మధ్యలో నిర్వహించారు. వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్,పాత్రికేయులు, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest