UPDATES  

NEWS

దళితులను అవమానించే చర్యలను సహించం

శుద్ధీకరణ పేరుతో అంటరానితనాన్ని ప్రోత్సహించడం దురదృష్టకరం: కనకం సాగర్ కరీంనగర్, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి ప్రతినిధి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ సమీపంలో దళిత దండోరా కార్యక్రమం అనంతరం రోడ్లు, పరిసరాలను పసుపు, తులసి నీటితో శుద్ధి చేసినట్లు వచ్చిన వార్తలు దళితుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని కరీంనగర్‌ డీసీసీ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కనకం విద్యాసాగర్‌ అన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు […]

పారిశుధ్య కార్మికుల పట్ల వివక్ష చూపితే ఊరుకోం : భూక్య రమేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి): కొత్తగూడెం మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు గత నాలుగేళ్లుగా సబ్బులు, బట్టలు, నూనె, బెల్లం, చెప్పులు, పని పరికరాలు అందించకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సెవెన్‌ హిల్స్‌ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వస్తువులను వెంటనే అందించాలని కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భూక్య రమేష్‌ మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన కార్మికులకు […]

తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరఫ్ చేయాలి : యెర్రా కామేష్

కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (తెలంగాణ వాణి): అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను వెంటనే పదవుల నుంచి భర్తరఫ్ చేయాలని జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్‌ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ నాయకులతో కలిసి పోస్ట్‌ఆఫీస్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కామేష్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని […]

అగ్ని ప్రమాద బాధితులకు కొత్త ఇళ్లు

బండపల్లి, సెప్టెంబర్ 10 (తెలంగాణ వాణి ప్రతినిధి):అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మంజుల, శేఖర్, రజిత కుటుంబాలు ఎట్టకేలకు నూతన ఇళ్లలోకి అడుగుపెట్టారు. నూతనంగా నిర్మించిన ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ కటకం మల్లేశం, ఉపసర్పంచ్ ఈసాక్‌తో పాటు గ్రామ పెద్దలు హాజరై బాధిత కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలు తిరిగి సొంతింటిలో అడుగుపెట్టడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నూతన ఇళ్లలో […]

*వరుసగా మూడు రోజులు సెలవులు*

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా వరుసగా సెలవులు లభించనున్నాయి. వినాయక నిమజ్జనం రోజున కూడా స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే వీధుల్లో చవితి మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి…

వేములవాడలో ఓటర్ల ‘సర్’ ప్రక్రియ విచారణ షెడ్యూల్ విడుదల చేసిన ఆర్డీఓ

వేములవాడలో ఓటర్ల ‘సర్’ ప్రక్రియ విచారణ షెడ్యూల్ విడుదల చేసిన ఆర్డీఓ నోటీసులు పొందిన ఓటర్లు విచారణ కేంద్రాలకు హాజరు కావాలి: ఆర్డీఓ కే.ఎస్.బి. కుమారి ​ఓటు హక్కు పరిరక్షణకు ‘సర్’ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలి: అఖిలపక్ష సమావేశం ​పోలింగ్ స్టేషన్ల వారీగా విచారణ తేదీలు ఖరారు.. పారదర్శకతకు సర్వత్రా సహకరించాలి వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమీక్షా సమావేశం వేములవాడ, సెప్టెంబర్ 09 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ నియోజకవర్గంలో ప్రత్యేక […]

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య మండల విద్యాధికారి ప్రభాకర్

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. మంగళవారం ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో ప్రార్ధన సమావేశ నిర్వహణను, ఉపాధ్యాయుల బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థులసామర్థ్యాలను పాఠశాల మౌలిక వసతులు, తరగతి గదులనుపరిశీలించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన ఏకరూప దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ […]

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, ధర్నా రాస్తారోకో

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (మధుసూదన్) చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ మంగళవారం ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ల నాయక్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ గేట్ వెలుపల టిఆర్ఎస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆ సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో ఎమ్మెల్సీ తాత […]

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును కఠినంగా శిక్షించాలి

ఆల్ ఇండియా అంబేద్కర్ ఆర్మీ తెలంగాణ చీఫ్ రమేష్ రావణ్ డిమాండ్. హైదరాబాద్ సెప్టెంబర్ 8 (తెలంగాణ వాణి స్పెషల్ టి.ఎన్ రమేష్) అసెంబ్లీ సాక్షిగా గౌరవ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను తీవ్రప్రదజాలంతో దూషించి, అంతటితో ఆగకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను సైతం దుర్భాషలాడిన నీతిమాలిన వ్యాఖ్యలు చేసినటువంటి దురహంకారి తాతా మధు అనే ఆంబోతుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆలిండియా అంబేద్కర్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర చీప్ రమేష్ […]

శ్రీ చైతన్యలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జగిత్యాల/వెల్గటూర్, సెప్టెంబర్ 5 (తెలంగాణ వాణి ప్రతినిధి) విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డి. షహిదొద్దీన్ అన్నారు. వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం.డి. షహిదొద్దీన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థుల జీవితాల్లో ఎంతో కీలకమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే […]