UPDATES  

NEWS

 నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు

ఎమ్మెల్యే డా పట్లోళ్ల సంజీవరెడ్డి

నారాయణఖేడ్ (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని జుక్కల్ గ్రామ శివారులో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేస్తూ జి .ఓ .ఆర్ టి. నెంబర్ 308 తేదీ:2026/10/15 నా విడుదల చేసింది. ఎమ్మెల్యే డా.పట్లోళ్ల సంజీవరెడ్డి విజ్ఞప్తి మేరకు యువజన, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు.ఎస్ ఏ టీ జి ఆధ్వర్యంలో 2026-27లో పనులు ప్రారంభించనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక పాత్రికేయులతో ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు,పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 17 October 2026, 5:15 pm Posted by : TELANGANA VANI

నారాయణఖేడ్ యువతకు జాతీయ స్థాయి క్రీడా వసతులు

ఎమ్మెల్యే డా పట్లోళ్ల సంజీవరెడ్డి

నారాయణఖేడ్ (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని జుక్కల్ గ్రామ శివారులో ఇండోర్, అవుట్ డోర్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేస్తూ జి .ఓ .ఆర్ టి. నెంబర్ 308 తేదీ:2026/10/15 నా విడుదల చేసింది. ఎమ్మెల్యే డా.పట్లోళ్ల సంజీవరెడ్డి విజ్ఞప్తి మేరకు యువజన, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు.ఎస్ ఏ టీ జి ఆధ్వర్యంలో 2026-27లో పనులు ప్రారంభించనున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయాన్ని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక పాత్రికేయులతో ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు,పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest