UPDATES  

NEWS

 పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లాలో నిర్వహించిన పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఎన్నిక జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి, అంకితభావం, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా రాజ్‌కుమార్ యాదవ్ ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, విద్యా ప్రమాణాల పెంపుదలతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు రాజ్‌కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 17 October 2026, 3:31 pm Posted by : TELANGANA VANI

పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్‌కుమార్ యాదవ్ పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లాలో నిర్వహించిన పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన ఎన్నిక జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి, అంకితభావం, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా రాజ్‌కుమార్ యాదవ్ ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, విద్యా ప్రమాణాల పెంపుదలతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు రాజ్‌కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest