UPDATES  

 ఓట్ల తొలగింపు రాద్ధాంతం కాంగ్రెస్ కుట్రే : మాజీ ఎమ్మెల్యే గుజ్జుల

ధర్మారం (తెలంగాణ వాణి) ఓట్లు తొలగించారని దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్దాంతం చేస్తుందని కేవలం డబుల్ ఓట్లు, మృతుల ఓట్లు మాత్రమే తొలగించారని అర్హులైన వారి ఓట్లను తొలగించలేదని మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్హులైన వారి ఓట్ల తొలగించినట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తొలగించిన ఓట్లు ఎన్నో అవి ఏ రకమైనయో బిఎల్వోల ద్వారా లిస్టు తీసుకొని అర్హులైన ఓట్లు తొలగించినట్లు ఉంటే సరి చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని ప్రభుత్వానికి చురకలాంటించారు. అనవసరమైన ఆరోపణ సరికాదు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఏసంగి పంటలను వేయొద్దంటున్నారు మరి రైతులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. 1920లో రెండు సంవత్సరాల పాటు ప్రజలు తీవ్ర కరువును ఎదుర్కొన్నారని ప్రస్తుతం తెలంగాణలో ఎల్ నినో ప్రభావానికి రాష్ట్ర ప్రజలు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేవంత్ సర్కార్ ఎల్ ఇనోపై ప్రత్యామ్నాయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తీవ్రమైన ప్రభావ సమయంలో ప్రత్యామ్నయం చేయకుండా ఓట్ల తొలగింపు రాద్ధాంతం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో నాయకులు వ్యక్తిగత ఆస్తులు కూడగట్టుకోవడం తప్ప ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన నిధులను పొందాలని సూచించారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణ చేసుకుంటూనే బిజెపిని బద్నాం చేయడం తగదన్నారు. ఈ దేశంలో 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో సుపరిపాలన అందుతుందని 80 సంవత్సరాల స్వతంత్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారిన రాహుల్ సూచనతోనే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తున్నారని అది సరైనది కాదని ప్రజలకు రైతాంగానికి అవసరమైన మౌలిక వసతులు రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజాప నాయకులు కొమ్ము రాంబాబు, అంజిరెడ్డి, భాజపా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తీగుళ్ల సతీష్ రెడ్డి, దేవి రాజలింగు, సీనియర్ నాయకులు మేడ వేణి శ్రీనివాస్, గోనె సాయి, కర్రే లక్ష్మణ్, సామంతుల కిరణ్, కొలిపాక మణికంఠ, ఆకుల లక్ష్మణ్, సాగంటి నరసయ్య, నాడెం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 16 October 2026, 5:19 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest