రైతులు సుభిక్షంగా ఉండాలి.. పంటలు సమృద్ధిగా పండాలి
నిర్మల్–బాసర, అక్టోబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి): ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, రైతులకు అనుకూలమైన పరిస్థితులు నెలకొనాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తకుండా రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.




