ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఎ సాయిచరణ్, పి అశ్రిత్ లు సెప్టెంబర్ 30 న పెద్దపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో ప్రతిభ ఆధారంగా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో నిర్వహించనున్న 9వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలుర నెట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ జైన రమాదేవి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పిఈటి సాయి కుమార్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.





