UPDATES  

NEWS

వినాయక నిమజ్జన శోభాయాత్రలో అపశృతి

కన్ను భాగం నుండి దూసుకు వెళ్లిన టపాకాయ మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేటలో రేవంత్ సేన యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో టపాకాయలు పేలుస్తుండగా ప్రమాదవశాత్తు చిట్యాల అరవింద్ అనే యువకుడి కన్నులోంచి తపాకాయ దూసుకు వెళ్ళింది. అరవింద్ ను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాదుకు తరలించారు.

మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరిని కలిసిన మండల ఓబీసీ నాయకులు ధర్మారం (తెలంగాణ వాణి)  పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు పరికిపండ్ల సత్యనారాయణ 9వ వర్ధంతి సందర్భంగా బసంత్ నగర్ విచ్చేసిన మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి (ఐఏఎస్) ను శనివారం బసంత్ నగర్ లోని వారి నివాసంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నరసింహులు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం సత్యనారాయణ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఓబిసి […]

సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు

ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులందరు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో గొల్లవాడ, రామాలయం సమీపంలో ఉన్న గణపతి మండపాల వద్ద నిర్వహించే లక్కీ డ్రా తీయడానికి మంత్రిని ఆహ్వానించగా మంత్రి స్పందిస్తూ తప్పకుండా హాజరవుతానని తెలిపినట్లు కమిటీ […]

గణనాథునికి 10 వేల రూపాయల విరాళం

ధర్మారం (తెలంగాణ వాణి) మండల కేంద్రంలోని బోయవాడ, ఎస్సీ కాలనీ, బెస్తవాడలో కొలువైన భారీ గణనాథులను మాజీ విఎస్ఎస్ చైర్మన్ దేవి జనార్ధన్ గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం 10 వేల రూపాయల చొప్పున మొత్తం ముప్పైవేల రూపాయలు నిర్వాహకులకు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ద్యాగేటి ఉదయ్ యాదవ్, సోగల తిరుపతి, ద్యాగేటి అనిల్, దేవి అఖిల్, పాలకుర్తి సాయి, పెరుమండ్ల ప్రసాద్, గుమ్ముల నరసయ్య, బొల్లి నాగరాజు, తిరుపతి, తదీతరులు […]

BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్ MLC కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు BRS ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంతకాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో హరీశ్, సంతోశ్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు

వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి) : జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు మంగళవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురైన ప్రజలకి జనసేన పార్టీ నాయకులు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ […]

పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన సిసిఆర్ సభ్యుడు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీని కౌన్సిల్ ఫర్ సిటిజన్ సభ్యుడు కట్టెకోల వివేకానంద సందర్శించారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ సిసిఆర్ సంస్థ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఒకటి సెప్టెంబర్ రోజున సమాచార హక్కు చట్టం బోర్డులను, అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నెంబర్లతో సహా బోర్డులను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పెట్టాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని పంచాయతీ కార్యాలయాల్లో లేనందున సిసిఆర్ సంస్థకు ఫిర్యాదులు […]

‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్దించాలి

పాత పెన్షన్ విధానమే శాశ్వత పరిష్కారం -లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తాం -భారీ నిరసన ర్యాలీ తో కలెక్టర్ కి వినతి పత్రం -టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మంచిర్యాల, సెప్టెంబర్ 01 (తెలంగాణ వాణి): ‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్దించాలని రాష్ట్ర టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా టీజీఈజెఎసి చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జిల్లాలోని 18 మండలాల అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు నాయకులు,సభ్యులు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిల్లా […]

తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకాలు

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హనుమకొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులు హైదరాబాద్/ఘట్కేసర్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సెకండ్ ఓపెన్ తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాద్ డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ల్లో జరిగాయి.కాగా ఈ పోటీల్లో హనుమకొండ పట్టణం నుండి,తైక్వాండో హనుమకొండ జిల్లా సెక్రెటరీ గడ్డం వెంకటస్వామి కోచ్ మామునూరి సంపత్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.కాగ వీరిలో జూనియర్ అండర్ 68కేజీ కొరిగి(ఫైట్) […]

ప్రభుత్వ పాఠశాలల్లో పనిముట్లు బహుకరణ

వేములవాడ,ఆగష్టు 29 (తెలంగాణ వాణి): వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న వేషాల అంజయ్య శుక్రవారం వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో వివిధ తోట పనుల నిమిత్తం ఒక గడ్డపార, రెండు తట్టలు మరియు రెండు చెక్క పారలు బహుకరించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ రాజారత్నం,ఫిజికల్ డైరెక్టర్ హమీద్,మల్లేశం,కోటేశ్వర్,సతీష్, చంద్రమౌళి తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.