UPDATES  

NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27 (తెలంగాణ వాణి):

NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న NHM ఉద్యోగులకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఏళ్లుగా వైద్య, ఆరోగ్య రంగంలో కీలక సేవలందిస్తున్న NHM ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.ప్రజలకు వైద్య సేవలు అందించే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, న్యాయం కల్పించినప్పుడే ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్, సిరిసిల్ల జిల్లా జనసేన నాయకులు నరేష్ నేరెళ్ల, మడిశెట్టి రోహిత్ తదితరులు పాల్గొని NHM ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 27 October 2026, 1:55 pm Posted by : TELANGANA VANI

NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27 (తెలంగాణ వాణి):
NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న NHM ఉద్యోగులకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఏళ్లుగా వైద్య, ఆరోగ్య రంగంలో కీలక సేవలందిస్తున్న NHM ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.ప్రజలకు వైద్య సేవలు అందించే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, న్యాయం కల్పించినప్పుడే ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్, సిరిసిల్ల జిల్లా జనసేన నాయకులు నరేష్ నేరెళ్ల, మడిశెట్టి రోహిత్ తదితరులు పాల్గొని NHM ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest