UPDATES  

NEWS

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు కరీంనగర్‌లో ఉద్రిక్తత కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్

 డ్రగ్స్ తీసుకున్న ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

హైదరాబాద్ (తెలంగాణ వాణి) రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో శనివారం ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. అదుపులోకి తీసుకున్న అనంతరం డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో సుధీర్ రెడ్డిని స్థానిక పోలీస్ స్టేసన్‌కు తరలించి విచారించారు. అనంతరం డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ సుధీర్ రెడ్డిపై రెండు డ్రగ్స్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest