UPDATES  

NEWS

దర్శనం సాయి ప్రణవ్ కు డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో రెండు గోల్డ్ మెడల్స్

సికింద్రాబాద్ (తెలంగాణ వాణి) హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో తార్నాక డివిజన్ లాలపేటకి చెందిన దర్శనం సాయిప్రణవ్ మొదటి స్థానంలో నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్య వారికి 500, 1000 మీటర్ల రేసింగ్ పోటీలను మొయినాబాద్ లో నిర్వహించారు. ఈ రెండు పోటీలలో సాయి ప్రణవ్ మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు […]

రోజువారీ జీవితంలో హిందీ యొక్క ఔచిత్యాన్ని తెలిపిన ప్రిన్సిపాల్ రావూరి నివేదిత

శ్రీ చైతన్య స్కూల్, ఖమ్మం–1 బ్రాంచ్‌లో శనివారం హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.హిందీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు, ప్రేరణాత్మక గీతాలు,పాత్ర ధారణలు,కథా వివరణలు ప్రదర్శించారు. మీరాబాయి, కబీర్ దాస్,రహీమ్ తదితర కవుల వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.ప్రిన్సిపాల్ రావూరి నివేదిత మాట్లాడుతూ హిందీ ఎలా రాష్ట్ర భాషగా,రాజ్య భాషగా అవతరించిందో తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య,డీజీఎం చేతన్,వైస్ ప్రిన్సిపాల్ యాచమనేని శశాంక్,డీన్ […]

నరసింహుని సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం

హుజూర్ నగర్ (తెలంగాణ వాణి) హుజూర్ నగర్ పరిధి ముక్త్యాల కెనాల్ కాలువ ప్రక్కన గుట్టమీద స్వయంభుగా వెలసిన శ్రీ పడగరాయ గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆ స్వామి మహిమలు అంతా ఇంతా కాదు పల్లె పల్లెనా గ్రామ గ్రామాన మారు మ్రోగు తున్న నామస్మరణం నరసింహునిది ఆ స్వామి మహిమలు చూడ ప్రజల తాండోపతండపగా తరలివస్తున్నారు ప్రతి శుక్రవారం స్వామి వారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు […]

డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్,కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్య పరిష్కరించాలని,అందరిని పర్మినెంట్ చేయాలని, ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం జీతాలు చెల్లించాలని,పలు డిమాండ్లతో కూడిన నిరావధిక సమ్మెను చేపట్టారు.నెలకు రూ.26వేలు పొందే కార్మికుడి వేతనం.. రూ.11,700కు తగ్గించడం బాధాకరం.ఈ కార్యక్రమంలో సరిత,ద్వాలీ,సీతా,సమ్మక్క,ముత్తమ్మ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చెయ్యండి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 12 : (తెలంగాణ వాణి ప్రతినిధి) సీ.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) అందించడంలో విఫలమైన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై నిబంధనల మేరకు రెవెన్యూ రికవరీ యాక్టును అమలుపర్చాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తహసీల్దార్ లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు చేపట్టిన […]

పర్యావరణ పరిరక్షణకై ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహన్

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మూడు సవంత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మంగళవారంరోజు పాల్వంచలో గల అయ్యప్పస్వామి దేవాలయం ఆవరణంలో ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయులు బాలుతో సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా హరినాథ్ తో కలిసి రుద్రాక్ష మొక్కలు నాటారు.

అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య

ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన రేవెల్లి మధుసూదన్ తండ్రి వెంకటేశ్వర్లు 29 సంవత్సరాలు వృత్తిరీత్యా పూజారిగా వ్యవహరిస్తాడు. అతడు ఆర్థిక ఇబ్బందులతో గత కొంతకాలంగా సతమతమవుతూ మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, మృతుని తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ తెలిపారు.

కాళోజికి నివాళులర్పించిన న్యాయవాద పరిషత్ నిజామాబాద్ సెప్టెంబర్ 09: (తెలంగాణ వాణి ప్రతినిధి) ప్రజల గొంతుకై గళమెత్తిన కాళోజీ హైదరాబాద్ సంస్థాన విమోచన కోసం ఉద్యమం నడిపిన కాళోజీ నారాయణ రావు ప్రజాజీవితం ఆదర్శనీయమని ‌‌ ‌న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. కాళోజీ111 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవితలు, కథలు రచించి ప్రజా ఉదయమానికి పూనాదులు వేశారని కొనియాడారు. […]

13 రోజులకు శ్రీకర్ మృతదేహం లభ్యం

మెట్ పల్లి (తెలంగాణ వాణి) జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన కాటిపెల్లి శ్రీకర్ రెడ్డి, గత నెల 27న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఎస్సార్ ఎస్పీ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు బయటపడగా, శ్రీకర్ రెడ్డి కెనాల్లో కొట్టుకుపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీకర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సోమవారం తాటిపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పి కాలువలో శ్రీకర్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం […]

చిన్నారి వైద్యానికి చేయూత

మరోసారి మానవత్వం చాటుకున్న పొంగులేటి క్యాంప్ శ్రేణులు   కొత్తగూడెం (తెలంగాణ వాణి) తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతు కొత్తగూడెంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ శ్రేణులు, ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలం నాగారం కాలనీ చెందిన కేసోజు కృష్ణమాచారి రేవతి దంపతుల కుమార్తె జ్ఞాన్విక తీవ్ర అనారోగ్యం పాలై శ్వాసకి సంబంధించిన […]