కరీంనగర్‌లో ఉద్రిక్తత

బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ గంగుల క్యాంప్ ఆఫీసుపై బీజేపీ శ్రేణుల దాడి..! కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం పోలీసుల తీరుపై మండిపడ్డ వద్దిరాజు రవిచంద్ర కరీంనగర్ (తెలంగాణ వాణి) కరీంనగర్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఖండిస్తూ…. బీఆర్ఎస్ నేతలు కూడా సవాళ్లు విసిరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి […]
కస్టమర్ల ముసుగులో వచ్చి కాల్పులు.. షోరూమ్‌లో దోపిడీ
కరీంనగర్ నగర నడిబొడ్డున పట్టపగలే సాయుధ దోపిడీ జరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కరీంనగర్ : మే 03 (తెలంగాణ వాణి ప్రతినిధి) ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కస్టమర్ల ముసుగులో షోరూమ్‌లోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లిన వెంటనే ఆయుధాలు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు […]
మే 4న మెగా జాబ్ మేళాకు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలి : కలెక్టర్ అంకిత్
యువత సమగ్ర అభివృద్ధి, క్రీడా రంగ ప్రోత్సాహం లక్ష్యంగా యువజన సర్వీసులు అండ్ క్రీడల రూపొందించిన “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సిపిఓ సంజీవరావు, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 5 నుండి మే 12 వరకు జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ […]
మండలంలో జెడ్పీ హెచ్ ఎస్ లక్ష్మీదేవిపల్లి పాఠశాలదే ఆగ్రస్థానం
నేడు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలోని 5 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా జెడ్పీహెచ్‌ఎస్ లక్ష్మీదేవిపల్లి పాఠశాల 92 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. ఈ పాఠశాలకు చెందిన షేక్ ఆశ్ర 494/600 మార్కులు సాధించి ప్రథమ స్థానం దక్కించుకోగా, గోపికా సాహితీ 492/600 మార్కులతో ద్వితీయ స్థానం పొందింది. విద్యార్థులు సాధించిన ప్రతిభపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చిన్న రామ్మూర్తి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం – పాల్వంచలో 36 మందికి ట్రైనింగ్
జనాభా గణన 2027 కార్యక్రమం సందర్భంగా ఏప్రిల్ 20 నుండి 25 వరకు నిర్వహించనున్న శిక్షణలో భాగంగా, మొదటి దఫా ఇండ్ల గణన మే 11 నుండి జూన్ 9 వరకు జరగనున్న నేపథ్యంలో పాల్వంచ మండల రూరల్ పరిధిలోని పాత ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని పాల్వంచ మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ శిక్షణలో భాగంగా మొత్తం 36 మంది ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ […]
వేములవాడలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
వేములవాడ,ఏప్రిల్ 14 (తెలంగాణ వాణి ప్రతినిధి) : వేములవాడ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఉదయం నుంచే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, న్యాయవాదులు,సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహానీయుడికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వేములవాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు,సీనియర్ న్యాయవాది గొంటి శంకర్, తెలంగాణ వాణి వేములవాడ నియోజకవర్గ ప్రతినిధి గొంటి గణేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా […]
సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్!
దశ వసంతంలోకి అడుగుపెట్టిన కళాశాల – ఘనంగా డీకేడిఎల్ టెక్నో ఫెస్ట్ వేడుకలు సిద్దిపేట/హుస్నాబాద్,ఏప్రిల్ 09 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రగతి పథంలో మరో మైలురాయిని అధిగమించింది. సివిల్ మరియు ఈఈఈ విభాగాలు విజయవంతంగా తొమ్మిది సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో ‘డీకేడిఎల్’ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ‘టెక్నిర్వాహణ’ మరియు ‘గ్రిడ్ స్టోము’ వంటి వినూత్న శీర్షికలతో […]
కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

జగిత్యాల (తెలంగాణ వాణి) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గురువారం నాడు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువను కప్పుకున్నారు.తన అభిమానుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తానన్న జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏ పార్టీలో చేరేది స్పష్టంగా ప్రకటించని మాజీ మంత్రి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడంతో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు జీవన్ రెడ్డి […]
హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్
కొత్తగూడెం కార్పొరేషన్ 52వ డివిజన్‌లో హ్యాండ్ బోర్ పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ కళావతి ధనరాజ్‌కు సమస్యను తెలియజేశారు.వెంటనే స్పందించిన కార్పొరేటర్ కళావతిధనరాజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన హ్యాండ్ బోర్‌ను మరమ్మతు చేయించారు.గెలిచిన నాటి నుంచి ప్రజలతోనే ఉంటూ, వారి సమస్యలను తనవిగా భావించి వెంటనే స్పందిస్తున్న కార్పొరేటర్‌కు డివిజన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది

మతి భ్రమించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు నాసిరకం పనుల వల్ల నాశనమైన పసివాడి జీవితం ములుగు జిల్లా బిఆర్ఎస్ మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి ములుగు (తెలంగాణ వాణి) పవిత్రమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో జరిగిన ఘోర ప్రమాదం చిన్నారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన రమేష్ కుమారుడు యువన్ (6) గద్దె సమీపంలో ఆడుకుంటుండగా ఇటీవల నిర్మించిన రాతి దిమ్మలు ఆకస్మికంగా కూలి అతనిపై పడాయి. ఈ ఘటనలో బాలుడికి […]