UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు

తాలు, తప్ప పేరుతో తూకం పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటు ఆందోళన    మల్లాపూర్ మే18,(తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేటలోని వరి ధాన్యము కొనుగోలు కేంద్రాలలో తాళి తప్ప పేరుతో తూకం ఎక్కువ వేస్తున్నారని మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్ ఆధ్వర్యంలో రైతులతో ధర్నా చేపట్టాడు.ఈసందర్భంగా నాగేష్ మాట్లాడుతూ ముత్యంపేట,రాఘవపేట రెండు గ్రామాలలో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయగా ముత్యంపేటలో మాత్రమే కిలో ధాన్యాన్ని తాళి తప్ప పేరుతో తూకం వేస్తున్నారని అన్నారు. […]

వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి

వైన్స్ ముందు శవాన్ని పెట్టి కుటుంబ సభ్యుల ధర్నా నారాయణఖేడ్/ పెద్ద శంకరంపేట్ మే:18 (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్ద శంకరంపేట పట్టణంలోని శంకరంపేట వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అశోక్ (40) ఆదివారం సాయంత్రం శంకరంపేట వైన్స్ లో మందు తీసుకొని పర్మిట్ రూంలో మద్యం సేవించి అకస్మాత్తుగా మరణించడంతో […]

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు కోచ్‌లు దగ్ధం హైదరాబాద్ (తెలంగాణ వాణి) రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక బోగీలో మొదలైన మంటలు.. క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో బోగీలోకి కూడా వ్యాపించాయి. ప్రమాద సంకేతాన్ని సకాలంలో […]

సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నరసింహసాగర్ గ్రామంలో రైతుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. పండించిన పంటను ఇంటికి తీసుకురావడం రైతులకు ఒక ఆనందం.అయితే అదే పంటను తీసుకెళ్తున్న సమయంలో రోడ్డు మధ్యలో ఎడ్లబండి ఇరుసు ఇరిగి పాడైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.నరసింహసాగర్,కొత్త అంజనాపురం గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 500 మంది రైతులు ప్రతిరోజూ తమ వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నారు. కానీ సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రవాణా […]

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆరోగ్య పత్రం అమలు, వేతన సవరణ ప్రకటనతో పాటు పలు పెండింగ్ సమస్యలను జూన్ 2 నాటికి పరిష్కరించాలని గిరిజన ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూకర రాంబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు యంపీ నాయక్ మాలోత్ ప్రతాప్ సింగ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆరోగ్య పత్రం సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అమలు […]

ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం కాకినాడలో నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం     కాకినాడ మే 16 (తెలంగాణ వాణి) రోజులాగే పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు బయలుదేరిన పేద కూలీలు ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చిన కాసేపటికే వారి జీవితాలు తెల్లారిపోయాయి. మృత్యువు టిప్పర్ లారీ రూపంలో దూసుకొచ్చి నలుగురు మహిళా కూలీలను బలితీసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ […]

లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి

లక్ష్మీదేవి పల్లి మండలంలోని వేపల్లగడ్డ గ్రామపంచాయతీ పరిధి హాలియా తండలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోత్ శాంతి శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందింది. నూనావత్ భీమా అనే రైతు పొలంలో మొక్కజొన్న తూర్పలు కూలీ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు

హైదరాబాద్, మే 12 (తెలంగాణ వాణి) మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అజ్ఞాతం వీడారు. భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సల్స్ విధానాలకు ఆకర్షితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్‌ కారణంగా ఉద్యమం వైపు వచ్చారు.   తర్వాతి కాలంలో అడవి బాట పట్టారు. మావోయిస్టు అగ్రనేతగా […]

గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్

భద్రాచలం మే 10:మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతతో కూడిన ఆధునిక పద్ధతులను అవలంబించి గిరిజనాభివృద్ధి కోసం నాణ్యతతో కూడిన మెరుగైన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని గిరిజన శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యత పరమైన నిర్మాణ పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా సేవలు అందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇంజనీర్ల కొరత ఉన్న నేపథ్యంలో […]

10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు భద్రాచలం (తెలంగాణ వాణి) అటవీ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇంచార్జ్ డీఆర్‌వో కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. సమాచారం ప్రకారం చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో రహదారి నిర్మాణ పనుల సమయంలో కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు […]