UPDATES  

NEWS

తెలంగాణ వాణి కథనానికి స్పందన – జంమ్గి బి లో నాలుగు లారీల జొన్నలు నింపిన అధికారులు

సంగారెడ్డి, కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి):

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఉదయం తెలంగాణ వాణి పత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించారు.

కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న జొన్నలను వెంటనే తరలించాలని రైతులు కంగ్టి–పిట్లం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలో, సమస్యను తెలంగాణ వాణి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. దీనికి స్పందించిన అధికారులు గంటల వ్యవధిలోనే జంమ్గి బి కేంద్రంలో నాలుగు లారీల జొన్నలను లోడ్ చేసి తరలింపు ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ వాణి పత్రిక యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రభుత్వానికి మరియు అధికారులకు వాటిని తెలియజేసి పరిష్కార మార్గాలను చూపడంలో తెలంగాణ వాణి పత్రిక ఎల్లప్పుడూ ముందుంటుందని రైతులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి మీడియా వేదికగా తెలంగాణ వాణి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest