అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని కోరిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్, ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సాధారణ పాఠశాలల తరహాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఒంటిపూట బడి అమలు చేస్తూ, సమయాల్లో మార్పులు చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,
GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్‌లో నిర్వహించిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్,విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని విజేతలతో పాటు వారి తల్లిదండ్రులను సన్మానించి అభినందించారు.సివిల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్” అంశంపై మౌలిక వసతుల సమస్యలకు స్మార్ట్, స్థిరమైన పరిష్కారాలను ప్రదర్శించగా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం “స్మార్ట్ […]
ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా

ప్రజానాయకుడు పొంగులేటి పై విషప్రచారమా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇళ్లను ముట్టడి చేస్తాం రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ కొత్తగూడెం (తెలంగాణ వాణి) వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమిలో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వారి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు తాము ఏలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలేదని వట్టినాగులపల్లి […]
రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం
శ్రీరామనవమి సందర్భంగా గోపతండలోని లాలు దాస్ మఠం వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఊరి పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.భజనలు,పూజలు, హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులందరికీ సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని సాక్షిగా లాలు దాస్ ఆశీర్వదించాలని మనసారా ఆకాంక్షించారు.
రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌లో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జె. బాలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆదినారాయణ ప్రారంభించి, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని,ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.జె. బాలు మాట్లాడుతూ ఇప్పటివరకు 46,500 మందికి రక్తం అందించామని,ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత ఉండేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.ఈ శిబిరంలో 37 మంది రక్తదానం చేశారు.ఈ […]
ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్ కు మొక్కలు అందజేసిన
కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ను ప్రకృతి ప్రేమికుడు, యంగ్ ఇండియ జాతీయ పురస్కార గ్రహీత బాలునాయక్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని సూచించారు. సమాజ సేవలో భాగంగా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలునాయక్‌ను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్, ఇందిరా, […]
వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట
సర్వారం గ్రామ పంచాయతీలో శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట మరియు ద్వజస్తంభం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CPI పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సునీత రాంబాబు, భూక్యా శ్రీనివాస్, ఆలయ పూజారి మిట్టు స్వామి, లావుడియా వినాయక్, హథీరాం తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో […]
టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం
భద్రాచలం: టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ తరఫున మండల విద్యాధికారి తోటమళ్ళ రమ గారికి ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం అందించారు. వేసవిలో ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 3 ELS మంజూరు చేయాలని, పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి 2 CCLలు ఇవ్వాలని కోరారు. జనగణన 2026 విధులకు సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయాలని, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.ఎంఈఓ రమ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో […]
కొత్తగూడెంలో నయా ల్యాబ్ దందా ?

భయపెట్టి ఆపరేషన్‌లకు ఒత్తిడి అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు డాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు భద్రాద్రి బ్యూరో (తెలంగాణ వాణి) కొత్తగూడెం పట్టణంలో కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌ల నిర్వాహకుల తీరు రోగుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ ఆరోగ్య సమస్యలను కూడా అత్యవసరంగా చూపిస్తూ, అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి సాధారణ కడుపునొప్పి తో కొత్తగూడెంలోని […]
అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్ ముందస్తు అరెస్ట్
లంబాడి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్‌ను చుంచుపల్లి లో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ చర్యపై సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కడమేనని విమర్శించారు. అరెస్టు లతో ఉద్యమాన్ని ఆపలేరని రమేష్ నాయక్ బాణోత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.