UPDATES  

 లారీని ఢీకొన్న మరో లారీ.. ఇద్దరు మృతి

లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్‌, క్లీనర్‌ మృతి

13 రోజుల వ్యవధిలోనే మరో ఘోర ప్రమాదం

శంకరపట్నం, సెప్టెంబర్ 30 (తెలంగాణ వాణి):

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారి–563పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో వెనుక లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందారు. ప్రమాదానికి గురైన లారీ నంబర్‌ ఆర్‌జే 04 జీసీ 8052గా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం తీవ్రతతో లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌, క్లీనర్‌ చిక్కుకుపోయారు. మృతదేహాలను బయటకు తీసేందుకు జాతీయ రహదారి రవాణాలో పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కే. శేఖర్‌గట్ల ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

13 రోజుల్లో రెండు ఘోర ప్రమాదాలు

ఈ నెల 17న దాడికల్‌ శివారులో బ్రేక్‌డౌన్‌ కారణంగా రహదారిపై నిలిచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే 13 రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలో మరో లారీ ప్రమాదం జరగడం హైవే భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. రాత్రివేళ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు, వాటి వెనుక వచ్చే వాహనాలకు హెచ్చరికలు, భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 30 September 2026, 12:20 am Posted by : TELANGANA VANI

లారీని ఢీకొన్న మరో లారీ.. ఇద్దరు మృతి

లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ.. డ్రైవర్‌, క్లీనర్‌ మృతి

13 రోజుల వ్యవధిలోనే మరో ఘోర ప్రమాదం

శంకరపట్నం, సెప్టెంబర్ 30 (తెలంగాణ వాణి):

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారి–563పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో వెనుక లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందారు. ప్రమాదానికి గురైన లారీ నంబర్‌ ఆర్‌జే 04 జీసీ 8052గా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం తీవ్రతతో లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌, క్లీనర్‌ చిక్కుకుపోయారు. మృతదేహాలను బయటకు తీసేందుకు జాతీయ రహదారి రవాణాలో పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కే. శేఖర్‌గట్ల ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

13 రోజుల్లో రెండు ఘోర ప్రమాదాలు

ఈ నెల 17న దాడికల్‌ శివారులో బ్రేక్‌డౌన్‌ కారణంగా రహదారిపై నిలిచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే 13 రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలో మరో లారీ ప్రమాదం జరగడం హైవే భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. రాత్రివేళ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు, వాటి వెనుక వచ్చే వాహనాలకు హెచ్చరికలు, భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest