ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్–14, అండర్–17 బాలబాలికల రెజ్లింగ్ జట్ల ఎంపికలు సెప్టెంబర్ 30న భద్రాద్రి కొత్తగూడెం CER క్లబ్లో నిర్వహించనున్నట్లు జిల్లా SGF కార్యదర్శి భూక్యా భావ్‌సింగ్ తెలిపారు.ఉదయం 9 గంటలకు క్రీడాకారులు రిపోర్ట్ చేయాలని సూచించారు. అండర్–14 విభాగంలో 01.01.2013 తర్వాత, అండర్–17 విభాగంలో 01.01.2010 తర్వాత జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్, SGF ఎలిజిబిలిటీ ఫామ్, ఆధార్ జిరాక్స్, జనన ధ్రువపత్రం, బోనఫైడ్ సర్టిఫికెట్ తదితర పత్రాలతో హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పదో తరగతి మార్కుల మెమోను కూడా తీసుకురావాలని సూచించారు.మరిన్ని వివరాలకు కోచ్ ఖాసీం 9949761181ను సంప్రదించాలని తెలిపారు.




