ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి)
ధర్మారం మండలం ఖిలావనపర్తి పాఠశాల విద్యార్థులు శనివారం బాసర, గోదావరి, నిర్మల్ వండర్ ల్యాండ్ సందర్శించారు. బాలల దినోత్సవం రోజున వాటర్ రైడ్స్, గేమ్స్ లో సందడి చేశారు. నిర్మల్ కొయ్య బొమ్మల తయారీని కూడా తెలుసుకున్నారు.తమ పార్క్ కు వచ్చిన మొదటి ప్రభుత్వ పాఠశాల ఖిలావనపర్తి పాఠశాలేనని నిర్వాహకులు ప్రశంసించి, హెచ్ఎం తెలుకుంట్ల స్వప్నను సన్మానించారు. ఉపాధ్యాయ బృందాన్ని సర్పంచ్ మోతె కనుకయ్య, ఎస్ఎంసి చైర్ పర్సన్ సాగంటి శారద అభినందించారు.




