UPDATES  

 సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు కదలిరావాలి

తిమ్మాపూర్, నవంబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):సిద్ధిపేటలో గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం 12 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని 23 గ్రామాల నుంచి సభకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సమన్వయం, ప్రయాణ ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సిద్ధిపేట సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ కుటుంబ భరోసా’ బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ దోహదపడుతుందని అన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమయానికి చేరుకుని సభను విజయవంతం చేయాలని బండారి రమేష్ గౌడ్ కోరారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 18 November 2026, 1:02 pm Posted by : TELANGANA VANI

సిద్దిపేట సభకు కాంగ్రెస్ శ్రేణులు కదలిరావాలి

తిమ్మాపూర్, నవంబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):సిద్ధిపేటలో గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మండల ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం 12 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని 23 గ్రామాల నుంచి సభకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సమన్వయం, ప్రయాణ ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సిద్ధిపేట సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 'ఇందిరమ్మ కుటుంబ భరోసా' బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు, పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ దోహదపడుతుందని అన్నారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమయానికి చేరుకుని సభను విజయవంతం చేయాలని బండారి రమేష్ గౌడ్ కోరారు

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest