తిమ్మాపూర్, నవంబర్ 18 (తెలంగాణ వాణి ప్రతినిధి):జిల్లాలో వరి కోతలు పూర్తవుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు రైస్ మిల్లులను కేటాయించకపోవడం, ఒక్క క్వింటాల్ ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అధికారులు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులు రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు మా ఊరపు సంపత్ కుమార్, రాంహనుమాన్ నగర్ సర్పంచ్ పిస్క సౌజన్య కృష్ణకిషోర్, అందె శేఖర్, గొట్టిముక్కల తిరుపతిరెడ్డి, గడ్డం అరుణ్, ఎరోజు లక్ష్మణ్, ఓంకార్ యాదవ్, సుద్దాల సతీష్, ఎలకపల్లి స్వామి, కందుకూరి ఈశ్వరాచారి, బుడిగ నరేష్, పాశం సంపత్, తదితరులు పాల్గొన్నారు.




