వేములవాడ, సెప్టెంబర్ 30 (తెలంగాణ వాణి): రాజన్న హిల్స్ హౌసింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ వేములవాడ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొల్లూరి శ్రీనివాస్‌ను బుధవారం ఘనంగా సన్మానించారు. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ధంశెట్టి వేణు, మంటప హనుమన్ వాడకట్టు సంఘం అధ్యక్షుడు డాక్టర్ మద్ది సత్యనారాయణ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాత్రికేయరంగం ద్వారా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సన్మానించిన వారికి కొల్లూరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.



