UPDATES  

NEWS

 చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన తల్లీకూతుళ్లు

వేములవాడ,నవంబర్ 17 (తెలంగాణ వాణి ప్రతినిధి) :చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ తల్లీకూతుళ్లు ఒకేసారి ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణులై పలువురికి ఆదర్శంగా నిలిచారు.గట్టుదుద్దెనపల్లి గ్రామానికి చెందిన జ్యోతి, ఆమె కుమార్తె అశ్రిత ఒకేసారి ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు.చదువును మధ్యలోనే ఆపేసినప్పటికీ పట్టుదల, ఆసక్తి ఉంటే ఎప్పుడైనా విద్యను కొనసాగించవచ్చని వీరు నిరూపించారు. తల్లితో పాటు కుమార్తె కూడా ఒకేసారి పరీక్షలు రాసి విజయం సాధించడం గ్రామస్థులతో పాటు పలువురిని ఆకట్టుకుంది. వీరి విజయంతో విద్యకు వయసు అడ్డంకి కాదనే సందేశం సమాజానికి అందించారు.ఈ సందర్భంగా జ్యోతి, అశ్రిత మాట్లాడుతూ.. చదువును మధ్యలో ఆపేసిన వారికి తిరిగి విద్యను కొనసాగించేందుకు ప్రభుత్వం ఓపెన్ ఇంటర్మీడియట్ (టాస్) ద్వారా గొప్ప అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాము పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.అదేవిధంగా వేములవాడలోని విఎండి స్టడీ సర్కిల్ ఆన్‌లైన్ నిర్వాహకులు వినయ్ కుమార్ తమకు అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. పరీక్షల విషయంలో అవసరమైన మార్గదర్శకత్వం, సహాయ సహకారాలు అందించిన వినయ్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా విఎండి స్టడీ సర్కిల్ ఆన్లైన్ నిర్వాహకులు వినయ్ కుమార్ మాట్లాడుతూ చదువు మధ్యలో ఆపేసిన వారు నిరుత్సాహపడకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఓపెన్ విద్యా అవకాశాలను వినియోగించుకోవాలని, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు.తల్లీకూతుళ్లు ఒకేసారి పరీక్షలు రాసి విజయం సాధించడం ద్వారా తమ కుటుంబానికే కాకుండా గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావడంతో గ్రామస్థులు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 17 November 2026, 5:32 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest