UPDATES  

NEWS

 ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా 200 స్టీల్ ప్లేట్లు విరాళం

ధర్మారం, (తెలంగాణ వాణి ) గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో సర్పంచ్ మందాల శ్రావణి హరీష్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. అందులో భాగంగా కీర్తి శేషులు సుంకరి రవీందర్ జ్ఞాపకార్థం వారి కుమారులు సాయికుమార్, మనికుమార్, రామ్‌లు గ్రామంలో శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్ల వాడకాన్ని తగ్గించాలనే లక్ష్యంతో 200 స్టీల్ ప్లేట్లను గ్రామ పంచాయతీకి విరాళంగా అందించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ ప్లేట్లను బహుకరించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాందాల శ్రావణి హరీష్ మాట్లాడుతూ.. మన గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రారంభించిన ఈ మంచి కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని కొనియాడారు. ప్రజలు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా ఈ స్టీల్ ప్లేట్లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్లేట్లను శుభ్రపరిచి తిరిగి గ్రామ పంచాయతీకి అందజేయాలని కోరారు.​ ప్లాస్టిక్ ప్లేట్లలో వేడివేడి ఆహారం, కూరలు తీసుకోవడం వల్ల అందులోని మైక్రో ప్లాస్టిక్ కణాలు ఆహారంలో కలిసి రక్తంలో చేరుతాయని, దీనివల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సర్పంచ్ హెచ్చరించారు. ఆరోగ్యకరమైన, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ తాళ్ళ కిరణ్ కుమార్ ఉప సర్పంచ్ పూసల మల్లేశం, వార్డు సభ్యులు గాజుల ముని. జోగుల లక్ష్మీ కొమురయ్య రేషవేణి మహేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 23 September 2026, 3:51 pm Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest