ధర్మారం (తెలంగాణ వాణి) కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఆదేశాల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రూప్ల నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ధర్మారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులను నియమిస్తూ ప్రకటన జారీ చేశారు. ధర్మారం తుమ్మల తిరుపతి, పెరుకపల్లి అచ్చే తిరుపతి, దొంగతుర్తి వేల్పుల శంకర్, లంబడి తండా బి భూక్య బాలు నాయక్, కొత్తపల్లి పుట్ట మహేందర్, గోపాల్రావుపేట్ దాడి రాజేష్, మల్లాపూర్ చంటి అనిల్, రామయ్య పల్లి బొడ్డుపల్లి నాగ రాజు, కొత్తూర్ కాంపల్లి పోచయ్య, పత్తిపాక బైరి వెంకన్న, శాయంపేట చెన్నెళ్లి సత్తయ్య, బొమ్మ రెడ్డిపల్లి సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రచ్చపల్లి బూరగడ్డ శంకరయ్య, పైడి చింతలపల్లి సింగం తిరుపతి, న్యూ కొత్తపల్లి ఉత్తెర్ల శ్రీనివాస్, చింతలపల్లి కందునూరి పోచయ్య, కమ్మరి ఖాన్ పెట్ ఇట్నేని మహేందర్, బొట్ల వనపర్తి జీల్ల సంపత్ యాదవ్, చామనపల్లి గౌడ గోవింద్, ఖిలా వనపర్తి గుడికందుల సురేష్, ఎర్రగుంటపల్లి దేవి శంకరయ్య, నర్సింగాపూర్ ఆరకొంతపు స్వామి రెడ్డి, బంజేరు పల్లె కడారి మహేష్, మేడారం ఉత్తేమ్ రాజయ్య, ఖానంపల్లి కాల్వ రామకృష్ణ, నాయకం పల్లి బానావత్ నరేష్, నరసింహులపల్లి బత్తిని రవి, బుచ్చయ్య పల్లి ఇమ్మిడిశెట్టి శంకరయ్య, లను నియమిస్తున్నట్లు రూప్లా నాయక్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు ఇప్పటినుండే గ్రామాలలో సామాన్య పేద ప్రజలకు సేవ చేయాలని నూతన అధ్యక్షులకు రూప్లా నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, నాయకులు చింతల ప్రదీప్ రెడ్డి, కొడారి హనుమయ్య, కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, నోముల వెంకట్ రెడ్డి, దాగేటి ఉదయ్ యాదవ్, అసోద అజయ్ కుమార్, సోగాల తిరుపతి, వేల్పుల నాగరాజు,పోలు దాసరి సంతోష్, ఒరేం చిరంజీవి,దేవి లావణ్య, తదితరులు పాల్గొన్నారు.





