ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం లోని ఎనిమిదోవ వార్డులో ఏర్పాటు చేసిన ఘనపతి మండపాన్ని బుధవారం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎన్నారై వ్యాల్ల హరీష్ రెడ్డి దర్శించుకున్నారు, ఆయనకు మండల కేంద్రానికి చెందిన సల్వాజీ మాధవరావు సాదరంగా స్వాగతం పలుకుతూ కండువా కప్పారు. అనంతరం గణనాథునికి హరీష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణపతి నిర్వాహకులు పాల్గొన్నారు.



