ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) ప్రజల జీవితాన్ని అక్షరాల్లో ఆవిష్కరించడం ప్రకృతి సౌందర్యాన్ని కవిత్వంలో పలికించడం మానవ సంబంధాలోని అర్ధాలు పాటల్లో ప్రతిబింబించడం పల్లె జీవనంలోని అనుభూతులను ప్రపంచానికి పరిచయం చేయడం అందిస్తూ ప్రత్యేకత అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం మండల శాఖ అధ్యక్షుడు బొల్లి నందయ్య పేర్కొన్నారు. మంగళవారం ధర్మారం మండల కేంద్రంలో అందెశ్రీ చిత్రపటానికి పూల మాలలువేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాటలోను తెలంగాణ మట్టి పరిమళం ప్రజల జీవన సంఘర్షణ ప్రకృతిపై ప్రేమ కనిపిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి అక్షరాయుధమైన అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య, ప్రస్తుత సిద్దిపేట జిల్లా రేపర్తి లో నిరుపేద కుటుంబంలో జన్మించి పాఠశాల విద్యకు దూరమై పశువుల కాపరిగా జీవనం సాగించాడని పేర్కొన్నారు. ఆయన జీవితంలో అసాధారణ పరిణామం ఆశువుగా పాటలు పాడుతూ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని పేర్కొన్నారని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ పాత్ర ప్రత్యేకమైనదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2004లో అందెశ్రీ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం ఆయన ప్రతిభ గుర్తించడం హర్షినియమన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చొప్పదండి మల్లేశం,అంబేద్కర్ అవార్డు గ్రహీత సుంచు మల్లేశం, నాయకులు ఇరుగురాల రాజనర్సు, లక్ష్మణ్, లింగన్న, తదితరులు పాల్గొన్నారు.





