భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ కార్యదర్శి జుబ్బు అలియాస్ అబ్దుల్ రెహమాన్‌కు అత్యవసరంగా రక్తం అవసరమనే సమాచారం అందడంతో వెంటనే స్పందించారు. ఏ పాజిటివ్ రక్తదాత బాచిని సంప్రదించి,అత్యవసర సమయంలో బాచి ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని జుబ్బు తెలిపారు.రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని ఆదుకునేందుకు సహకరించిన బాచికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనార్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




